Free Training for unemployed youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free Training for unemployed youth

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఉచితంగా ఉపాధి శిక్షణ అందజేసి వివిధ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్‌ కల్పించేందుకు ఉపక్రమించింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను స్కిల్‌ కళాశాలగా మార్పు చేశారు.

ఇక్కడ అవసరమైన రకరకాల శిక్షణలు ఇవ్వదలిచారు. దీనదయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన, నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా మొదటి విడతలో ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌వోఈ), ఫుడ్‌ అవుట్‌లెట్‌ మేనేజర్‌ (ఎఫ్‌వోఎం) కోర్సులో 30 మంది చొప్పున మొత్తం 60 మంది పురుష, మహిళా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు ఇంటర్మీడియట్‌, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వారికి ప్రత్యేక ట్రైనర్ల ద్వారా బోధిస్తున్నారు.

ఇదే శిక్షణ ప్రైవేట్‌ కంపెనీలు ఇస్తే ఒక్కో అభ్యర్థికి మూడు నెలల పాటు లక్షల్లో ఖర్చవుతుంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోంది. అనంతరం శిక్షణ సర్టిఫికట్లు కూడా మంజూరు చేయనుంది.

#Tags