Free training for police jobs: పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

Free training for police jobs

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జీడీ, సీఆర్‌పీఎఫ్‌ తదితర విభాగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి అవసరమైన శిక్షణను రామ్‌కీ ఫౌండేషన్‌, రీ–సస్టైనబుల్టీ లిమిటెడ్‌, గ్రీన స్పేస్‌ హౌసింగ్‌ అండ్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్నట్లు రామ్‌కీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఎంవీ రామిరెడ్డి బుధవారం ఓప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాదులో 250 మంది, గుంటూరులో 250 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సాయుధ బలగాల నియామకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 26 వేలకుపైగా కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపధ్యంలో టెన్త్‌ ఉత్తీర్ణులైన 18 నుంచి 23 ఏళ్లలోపు గల ఓసీ అభ్యర్థులు, 26 ఏళ్లలోపు ఓబీసీ, 28 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు శిక్షణ పొందేందుకు అర్హులని వివరించారు.

మొదటి విడత అర్హత పరీక్షకు హాజరు కాలేకపోయిన ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థుల సౌకర్యార్థం ఈ నెల 23న తుళ్లూరు మండలం పెదపరిమిలోని రామ్‌కీ ఫౌండేషన్‌ నైపుణ్య శిక్షణకేంద్రంలో మరోసారి అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

అర్హత పరీక్షా ఫలితాలను ఈనెల 24న, ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఈనెల 25న విడుదల చేస్తామని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు ఈనెల 26వ తేదీ నుంచి శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుందని, శిక్షణతోపాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్‌ ఉచితంగా ఇస్తామన్నారు. వివరాలకు 7337585959, 9000797789 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

#Tags