Free tailoring classes: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
నగరశివారులోని గంగస్థాన్ ఫేజ్–2 లోగల రామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో మాధవ స్మారక సేవా సమితి ఇందూరు ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఉపాధ్యక్షుడు హితిన్ బీమాని ఆదివారం ప్రారంభించారు.
Anganwadi Posts: 10th Class అర్హతతో అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సేవా సమితి కార్యదర్శి మర్ని కృష్ణారెడ్డి, కోశాధికారి గణేష్, కార్యవర్గసభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గురుచరణం, నగర అధ్యక్షుడు డైట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
#Tags