Free Coaching: ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోండి.. విజయం సాధించండి..
ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం తప్పక సాధించవచ్చని గ్రూప్–2 అభ్యర్థులకు అనంతపురం బీసీ స్టడీ సర్కిల్ ఉపసంచాలకులు కుష్బూ కొఠారి సూచించారు.
బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రూప్–2 శిక్షణా తరగతులను డిసెంబర్ 28(గురువారం) ఆమె ప్రారంభించి, మాట్లాడారు. ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిలబస్‌ను పూర్తిగా అధ్యయనం చేసి ప్రధాన అంశాలను గుర్తించి, వాటిపై నిరంతర సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
Free Coaching for Group Exams: సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎక్కడంటే..
#Tags