Field Officer Jobs Notification released news: ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... నెలకు 96వేల జీతం
కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్ లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ లోపు పంపించాలి..
LIC లో ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు: Click Here
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివితే మీకు తెలుస్తాయి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాకే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయండి .
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
భర్తీ చేస్తున్న పోస్టులు: డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అనే పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు:
ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (లేదా)
సైన్స్ లేదా ఇతర టెక్నికల్ లేదా సైంటిఫిక్ రంగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Valid GATE స్కోర్ కలిగి ఉండాలి.
మొత్తం ఖాళీల సంఖ్య: 160 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
జీతము: 96,000/-
వయస్సు: ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు ఉండవలసిన గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు: ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది..
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 21-09-2024 నుండి ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ: ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు అక్టోబర్ 21వ తేదీ లోపు తమ అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.
అప్లికేషన్ విధానం: అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా: Post Bag No.001 , Lodhi Road Head Post Office, New Delhi – 110003
ఎంపిక విధానం:
అప్లై చేసుకున్న అభ్యర్థులను గేట్ స్కోర్ లో వచ్చిన మార్కులు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
షార్ట్ లిస్ట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.