Bad news for Anganwadi teachers: అంగన్‌వాడీ టీచర్లకు బ్యాడ్‌న్యూస్‌ ఎందుకంటే..

Bad news for Anganwadi teachers

కడప కోటిరెడ్డిసర్కిల్‌అంగన్వాడీ చిన్నారులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అంగన్వాడీ కేంద్రాలు తెరిచి నెలలు గడుస్తున్నా పాఠ్య పుస్తకాలు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా పాత పుస్తకాలతోనే బోధనలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

Bad News Anganwadi Center Closed: మూతపడిన అంగన్‌వాడీ కేంద్రం ఇబ్బందుల్లో చిన్నారులు

బాల్య దశలో విజ్ఞానం పెంపొందించడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో చిన్నారులు పట్టు సాధించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన బొమ్మల పుస్తకాలు ఆయా కేంద్రాలకు అందజేసేది. నాలుగు పుస్తకాలతో కూడిన బర్డ్స్‌–1, బర్డ్స్‌–2 కిట్లను అందించింది. వీటితోపాటు అంగన్వాడీల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ మాదిరిగా ఇంగ్లీషులోపాఠాలు బోధిస్తుంటే కేంద్రాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.

బోధనలకు సంబంధించి రెండు నుంచి నాలుగేళ్లలోపు చిన్నారులకు ఇంగ్లీషు, గణితం, స్పోకన్‌ ఇంగ్లీషు, యాక్టివిటీ డ్రాయింగ్‌కు సంబంధించిన ఐదు పుస్తకాలతో కూడిన పీపీ–1 కిట్లు అందజేసేవారు. నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు కలిగిన చిన్నారులకు ఐదు పుస్తకాలతో కూడిన పీపీ–2 కిట్లను అందించేవారు. కానీ ఈ ప్రభుత్వంలో పాఠ్య పుస్తకాల పంపిణీ ఊసే లేకుండా పోయింది.

త్వరలో కొత్త పుస్తకాలు వస్తాయి

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల విద్యాబ్యాసానికి ఎలాంటి ఢోకా లేదు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న పాఠ్య పుస్తకాలు విద్యాబోధనకు సరిపోతోంది. త్వరలో కొత్త పుస్తకాలు వస్తాయి. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యాబోధన విధానాన్ని ప్రతిరోజు టైమ్‌ టేబుల్‌గా అన్ని కేంద్రాలకు పంపించాం. అంగన్వాడీ వర్కర్లు చిన్నారులకు పాఠాలు, ఆటల ద్వారా విద్యను బోధిస్తున్నారు.

జిల్లాలో 13 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా, 2212 మెయిన్‌, 177 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మూడు నుంచి ఆరేళ్లలోపు 56,159 మంది చిన్నారులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు కావస్తున్నా అంగన్వాడీ కేంద్రాల వైపు దృష్టి సారించలేదు.

అంగన్వాడీ కేంద్రాలకు పీపీ–1, పీపీ–2 పుస్తకాలు అందకపోవడంతో వర్కర్లు పాత పుస్తకాలతోనే బోధిస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా ఇంకా పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. గత ప్రభుత్వం సకాలంలో పుస్తకాలను అందిచడంతోపాటు వాటిలో చిన్నారులకు ఎంతో ఉపయోగపడే పాఠ్యాంశాలు ఉండడంతో తల్లిదంఢ్రులు కూడా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుని అంగన్వాడీ కేంద్రాలకు తమ చిన్నారులను పంపించేవారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త పుస్తకాలను అందించకపోవడంతో పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

#Tags