14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు

RRB jobs

RRB Technician Bharti 2024 : రైల్వే ఉద్యోగార్థులకు ఇటీవల కాలంలో వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గత మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

కంప్యూటర్‌ స్కిల్స్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, ఇంటర్య్వూ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ: Click Here

ఖాళీల సంఖ్య పెంపు
ఈ నోటిఫికేషన్‌ సమయంలో 9,144 ఖాళీలు పేర్కొనగా, ఈ సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ (Indian Railway) ఆగస్టు 22వ తేదీన అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా ఈ సంఖ్యను పెంచుతూ, మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

జోన్ల వారీగా ఖాళీల వివరాలు
ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 959 ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా చెన్నై జోన్‌లో 2716 ఖాళీలు, అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 91 ఖాళీలు ఉన్నాయి.

సంప్రదించాల్సిన వివరాలు
ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంబంధిత రైల్వే జోన్ల అధికారులను సంప్రదించవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది.

దరఖాస్తు సరిదిద్దడం మరియు ప్రాధాన్యతలు
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును సరిదిద్దడంతో పాటు పోస్టుల ప్రాధాన్యతలు ఇచ్చుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

దరఖాస్తు తేదీలు
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం
కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వేతన వివరాలు
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది.

పూర్తి వివరాలు
సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోని అభ్యర్థులు పూర్తి వివరాలకు https://rrbsecunderabad.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 14,298

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్‌ లైన్‌) పోస్టులు : 1,092
టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్‌ లైన్‌) పోస్టులు : 8,052
టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్‌ అండ్‌ పీయూఎస్‌) పోస్టులు : 5,154

విద్యార్హతలు:
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు: బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణలై ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు: మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/ ఫిట్టర్/ వెల్డర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ మెకానిక్ మెకానిక్/ మెకానిక్ మెకాట్రానిక్స్‌/ మెకానిక్ డీజిల్‌/ మెకానిక్ (మోటార్ వెహికిల్)/ టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్‌ మెషిన్ టూల్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ తదితరాలు). లేదా 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్‌) ఉత్తీర్ణలై ఉండాలి.

వయోపరిమితి: జులై 1, 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 ఏళ్లు.. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 2, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 16, 2024
దరఖాస్తుల సవరణ తేదీలు: అక్టోబర్‌ 17 నుంచి 21 వరకు సవరణ చేసుకోవచ్చు.

#Tags