Richest YouTuber In India: చదువులో పూర్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఏకంగా రూ. 41 కోట్లు సంపాదిస్తున్నాడు
ఓ యువకుడు ఉన్నత చదువలు చదవకపోయినా కోట్లు సంపాదించి ఆశ్చర్యపరుస్తున్నాడు. డబ్బు సంపాదించగల సత్తువ ఉంటే అకడమిక్ చదువులతో పనిలేదని ఈ వ్యక్తి ప్రూవ్ చేసి చూపించాడు. మన వద్ద మంచి టాలెంట్ ఉంటే దానికే పదును పెడితే కోట్టు వచ్చి పడతాయని చెప్పకనే చెప్పాడు ఈ కుర్రాడు. ఎలా అంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడంటే..
కేవలం పదేళ్ల వయసులోనే!..
ఫరిదాబాద్‌కి చెందిన అజయ్ నగార్ Aka (ఆల్సో నోన్ యాజ్ ) కైరీమినాటీ.. తన పీర్స్‌లో bae (బిఫోర్ ఎనివన్ ఎల్స్) కెరీర్ స్టార్ట్ చేశాడు. కేవలం పదేళ్ల వయసులోనే! STeaLThFeArzZ అనే యూట్యూబ్ అకౌంట్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ.. తన మెయిన్ యూట్యూబ్ చానెల్ అడిక్టిడ్ ఏ1కి మాత్రం 2014లో లాగిన్ అయ్యాడు. అలా వీడియో గేమ్ క్లిప్స్.. రియాక్షన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ! గతేడాది ఆగస్ట్ కల్లా 40 మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నాడు. తన అన్న యశ్ నగార్‌తో కలసి మ్యూజిక్ ఆల్బమ్స్‌కీ పనిచేస్తున్నాడు.
బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు..
అజయ్ నగార్ నెలకు 25 లక్షలు సంపాదిస్తున్నాడని, నెట్ వర్త్ దాదాపు 41కోట్లు ఉండొచ్చని పాపులర్ న్యూస్ సైట్ల అంచనా. హరియాణాలోని ఫరిదాబాద్‌కి చెందిన ఈ అబ్బాయి ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ట్వల్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేదట. కానీ లైఫ్‌లో మాత్రం పాస్ అయ్యాడు కదా అని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఆ ఫాలోయింగే అజయ్‌ని 2020లో ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా లిస్ట్‌లోకి చేర్చింది. అపార్ట్ ఫ్రమ్ అకడమిక్స్ సమ్ అదర్ టాలెంట్ ఆల్సో ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాడు కదా అజయ్ నగార్!