Inspirational Success Story : మట్టి ఇంట్లో నివాసం.. రూ.2 కోట్ల జాక్‌ పాట్‌ కొట్టిన యువ‌కుడు.. ఎలా అంటే..?

కలలు అందరూ కంటారు. కానీ సాధించేది మాత్రం కొందరే. ఆ ల‌క్ష్య సాధ‌న‌ కోసం ఎంతో వీరు క‌ష్ట‌ప‌డి.. ఉన్న‌త స్థానంకు చేరుకుంటారు. ప్ర‌స్తుతం చాలా మంది యువ‌త‌ ఇంజనీరింగ్‌ చదివి గూగుల్‌ లాంటి టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలనేది క‌ల కంటుంటారు.

అందులోనూ ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన వేళ అలాంటి ‍డ్రీమ్‌ జాబ్ సాధించడం అంటే కత్తి మీద సామే. కానీ  ప్రతిష్టాత్మక కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగాన్ని సంపాదించాడో యువకుడు. ఇత‌నే బీహార్‌లోని జముయి జిల్లాకు చెందిన అభిషేక్ కుమార్. ఏకంగా అతి పెద్ద‌ గూగుల్ కంపెనీలో రూ. 2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. దీంతో అతని కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ యువ‌కుడి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం...

కుటుంబ నేపథ్యం : 
అభిషేక్ కుమార్ బీహార్‌లోని జాముయి జిల్లాలోని జము ఖరియా గ్రామానికి చెందిన వారు. అభిషేక్‌ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్. ఈయ‌న‌ జముయి సివిల్ కోర్టులో న్యాయవాది. తల్లి మంజు దేవి గృహిణి. ముగ్గురి సంతానంలో చివరివాడు అభిషేక్‌. 

☛ Civils 2023 Ranker Hanitha Inspire Success Story : కాలం కదలలేని స్థితిలో పడేస్తే.. ఈమె సంకల్పం సివిల్స్ కొట్టేలా చేసిందిలా.. కానీ..

ఎడ్యుకేష‌న్ :
అభిషేక్ కుమార్ పట్నా ఎన్‌ఐటీ నుంచి బీటెక్‌ పూర్తి చేశాడు. 

నా డ్రీమ్‌ కోసం అహర్నిశలు క‌ష్ట‌ప‌డ్డా ఇలా..
అభిషేక్‌కు పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. అయినా అక్కడితో ఆగిపోలేదు అభిషేక్‌.  తన డ్రీమ్‌ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. చివరికి సాధించాడు. బీటెక్‌ తరువాత 2022లో అమెజాన్‌లో రూ.1.08 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అక్కడ 2023 మార్చి వరకు పనిచేశాడు.  ఆ తర్వాత, జర్మన్ పెట్టుబడి సంస్థ విదేశీ మారకపు ట్రేడింగ్ యూనిట్‌లో చేరాడు. ఇక్కడ పనిచేస్తూనే ఇంటర్వ్యూలకు  కష్టపడి చదివి గూగుల్‌లో ఏడాదికి 2.07కోట్ల రూపాయల జీతంతో  ఉద్యోగాన్ని సాధించాడు.గూగుల్‌ లండన్‌ కార్యాలయంలో అక్టోబర్‌లో విధుల్లో చేరనున్నాడు.

నైపుణ్యాల‌ను పెంచుకుంటూ..
అభిషేక్‌ మాటల్లో చెప్పాలంటే ఒక కంపెనీలో 8-9 గంటలు పని చేస్తూ, మిగిలిన సమయాన్ని తన కోడింగ్ నైపుణ్యాలను పెంచుకుంటూ , గూగుల్‌లో ఇంటర్వ్యూల కోసం ప్రిపేరయ్యేవాడు. ఇది గొప్ప  సవాలే. ఎట్టకేలకు అభిషేక్   పట్టుదల  కృషి ఫలించింది. 

☛ UPSC Civils 2nd Ranker Animesh Pradhan Story : చిన్న వ‌య‌స్సులోనే నాన్న మృతి.. మ‌రో వైపు సివిల్స్ ఇంట‌ర్వ్యూ టైమ్‌లోనే అమ్మ మ‌ర‌ణం.. ఆ బాధతోనే..

మారుమూల గ్రామంలో మట్టితో చేసిన ఇంట్లోనే.. ఉంటూ..
నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చా. నా మూలాలు ఎక్కడో గ్రామంలో మట్టితో చేసిన ఇంట్లోనే ఉండేవాళ్లం. ఇప్ప‌డిక‌ నేను కొత్త ఇల్లు నిర్మిస్తున్నాను. అన్నాడు సంతోషంగా. అంతేకాదు ఏదైన సాధించాలంటే.. క‌సితో పోరాడితే అన్నీ సాధ్యమే. చిన్న పట్టణమైనా, పెద్ద నగరమైనా,  ఏ పిల్లలైనా సరే, అంకితభావం ఉంటే,  గొప్ప అవకాశాలను అందుకోగలరని నేను దృఢంగా నమ్ముతాను’’ అంటూ తన తోటివారికి సందేశం కూడా ఇచ్చాడు. అభిషేక్ తల్లి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట. ఆమెకు మెరుగైన జీవితాన్ని అందించాలనే కోరికే కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ప్రేరేపించిందంటాడు అభిషేక్‌. 

నాకు స్ఫూర్తి వీరే..
ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తల్లితండ్రులు, సోదరులే తనకు పెద్ద స్ఫూర్తి అని చెప్పాడు.

#Tags