Women Self Employment : మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ.. ఈ విభాగాల్లోనే..
కడప: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు సెప్టెంబరు 4వ తేది నుంచి టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి ఆరీఫ్ తెలిపారు.
18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇస్తారన్నారు. దూర ప్రాంతాల వారికి శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారన్నారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
#Tags