Venkaiah Naidu: నూతన విద్యావిధానం అమలులో.. ఏపీ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తోంది..

గుంటూరు ఎడ్యుకేషన్‌/గుంటూరు మెడికల్‌/మంగళగిరి: కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని ఏపీ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభినందించారు.
Venkaiah Naidu, Vice President of India

ఏపీ ప్రభుత్వం మాదిరిగా ప్రతి రాష్ట్రమూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. మార్చి 1వ తేదీన గుంటూరు జిల్లా ఆత్మకూరులో రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన గురు సన్మానం, 2020–2021 విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామినేని ఫౌండేషన్‌ మాతృభూమికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా..
కరోనా సమయంలోనూ విద్యా వ్యవస్థను కొనసాగించేందుకు ఉపాధ్యాయులు శ్రమించిన తీరు అభినందనీయమన్నారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసి, ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రముఖ రచయిత వేదాంతం శరశ్చంద్రబాబు రచించిన నీతి కథల సమాహారం ‘కథాసూక్తమ్‌’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు.

#Tags