Summer Placement : రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కు రెండు లక్షల స్టయిఫండ్‌!

రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ చేస్తే రూ.2 లక్షల స్టయిఫండ్‌! ఆ తర్వాత అదే కంపెనీల్లో శాశ్వత కొలువులు సైతం సొంతం చేసుకునే అవకాశం! ఫైనల్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఎస్‌పీఓ ద్వారా ముందుగానే ఫైనల్‌ ఆఫర్‌కు మార్గం సుగమం చేసుకోవచ్చు!!

దేశంలో ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌.. .ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) క్యాంపస్‌ల్లో సమ్మర్‌ ప్లేస్‌మెంట్స్‌ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. 2024–26 బ్యాచ్‌ పీజీపీ విద్యార్థులకు సగటున రూ. 2 లక్షల స్టయిఫండ్‌తో సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ లభించాయి! ఈ నేపథ్యంలో.. ఐఐఎంల్లో ఎస్‌పీఓ తాజా ట్రెండ్స్, భవిష్యత్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం..

సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ అంటే

సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ అంటే.. ఇంటర్న్‌షిప్‌ అనే చెప్పాలి. విద్యార్థులు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు పొందడానికి ఏదైనా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేయడం తెలిసిందే. ఐఐఎంలు, ఇతర బి–స్కూల్స్‌లో ఈ ఇంటర్న్‌షిప్‌నకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు చేపట్టే ప్రక్రియనే సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ అంటారు. అందులో ఎంపికైన వారికి ఇచ్చే ఆఫర్స్‌నే సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌(ఎస్‌పీఓ)గా పిలుస్తారు. ఎంబీఏలో చేరిన విద్యార్థులకు మొదటి సంవత్సరం పూర్తయ్యాక సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫ ర్స్‌ ఇచ్చి..ఇంటర్న్‌ ట్రైనీగా అవకాశం కల్పిస్తున్నా యి. ఇలా ఇంటర్న్‌ ట్రైనీగా ఎంపికైన వారికి స్టయిపండ్‌ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు.

World Oldest Alphabet: ప్రపంచంలో తొలి వర్ణమాలను కనుగొన్న శాస్త్రవేత్తలు!

ఎస్‌పీఓల హవా

తొలి తరం ఐఐఎంలు లక్నో, అహ్మదాబాద్, బెంగళూరుల్లో 2024–26 బ్యాచ్‌ విద్యార్థులకు సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ వెల్లువెత్తాయి. ఐఐఎం–లక్నోలో మొత్తం 576 మంది విద్యార్థులకు ఎస్‌పీఓ లభించాయి. వీరికి సగటు స్టయిఫండ్‌ నెలకు రూ.1.43 లక్షలుగా, గరిష్ట స్టయిఫండ్‌ రూ.3.95 లక్షలుగా నిలవడం విశేషం. ఐఐఎం –కోల్‌కతలో 564 మంది విద్యార్థులకు గాను అందరికీ సమ్మర్‌ ప్లేస్‌మెంట్స్‌ లభించాయి. ఇక్కడ సగటు స్టయిఫండ్‌ రూ.1.89 లక్షలుగా, గరిష్ట స్టయిఫండ్‌ రూ.3.67 లక్షలుగా నిలిచింది. ఐఐఎం–బెంగళూరు క్యాంపస్‌లో 601 మంది విద్యార్థులకుగాను అందరికీ ఎస్‌పీఓలు లభించాయి. ఈ క్యాంపస్‌లోనూ సగటు స్టయిఫండ్‌ రూ.2 లక్షలుగా, గరిష్ట స్టయిఫండ్‌ రూ.3.5 లక్షలుగా నమోదైంది. 

Follow our YouTube Channel (Click Here)

నవతరం ఐఐఎంల్లోనూ

నవతరం ఐఐఎంల్లో ఒకటైన ఐఐఎం–ఇండోర్‌లో నూటికి నూరు శాతం విద్యార్థులకు సమ్మర్‌ ప్లేస్‌మెంట్స్‌ లభించాయి. ఇక్కడ సగటు స్టయిఫండ్‌ రూ.1.25 లక్షలుగా ఉంది. మిగిలిన క్యాంపస్‌లలో డిసెంబర్‌ మొదటి వారంలో సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని.. రెండు లేదా మూడు దశల్లో డిసెంబర్‌ 15వ తేదీలోపు ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆయా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Job Fair:రేపు ఉస్మానియా వర్సిటీలో జాబ్‌మేళా

జోరు పెరిగిన తీరు

ఐఐఎం క్యాంపస్‌ల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ జోరు పెరిగిందని చెప్పొచ్చు. వాస్తవానికి కోవిడ్‌ తర్వాత రెండేళ్లు స్తబ్దుగా ఉన్న ఎస్‌పీఓలు.. గత ఏడాది గాడిలో పడ్డాయి. ఈ ఏడాది అవి మరింత పుంజుకున్నాయి. మార్కెట్‌లో ఆయా సంస్థల కార్యకలాపాలు, వ్యాపారాలు తిరిగి పుంజుకోవడంతో.. దానికి అనుగుణంగా నియామకాల కోసం ఐఐఎంలకు వస్తున్నట్లు చెబుతున్నారు. 

ఇతర బి–స్కూల్స్‌లోనూ

మేనేజ్‌మెంట్‌ విద్యలో పేరున్న ఢిల్లీ యూనివర్సిటీలోకి ఫ్యాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌(ఎఫ్‌ఎంఎస్‌) విభాగంలోనూ ఎంబీఏలో ఈ సారి ఆఫర్లు మెరుగ్గా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలోని మరో ప్రముఖ బి–స్కూల్‌ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ–జంషెడ్‌పూర్‌లో తాజాగా వంద శాతం ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లు లభించాయి. ఇక్కడ రెండు నెలల వ్యవధికి ఇచ్చే స్టయిపండ్‌ కూడా గరిష్టంగా రూ.3.5 లక్షలుగా నమోదైంది. 

Follow our Instagram Page (Click Here)

ఈ రంగాలదే హవా

ఈ ఏడాది సమ్మర్‌ ప్లేస్‌మెంట్స్‌లో కన్సల్టింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్‌ రంగాల హవానే కనిపించింది. ఇప్పటివరకూ లభించిన ఆఫర్లల్లో దాదాపు 40 శాతం మేరకు కన్సల్టింగ్, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సంస్థల నుంచే ఉన్నాయి. బీసీజీ, బెయిన్‌ అండ్‌ కో, యాక్సెంచర్‌ స్ట్రాటజీ, పీడబ్ల్యూసీ, డెలాయిట్, కేపీఎంజీ, సినర్జీ కన్సల్టింగ్‌ సంస్థలు టాప్‌ రిక్రూటర్స్‌గా నిలిచాయి. కన్సల్టింగ్, ఫైనాన్స్‌ రంగాల తర్వాత ఐటీ, ఈ–కామర్స్‌ సంస్థలు టాప్‌ రిక్రూటర్స్‌గా నిలిచాయి. ఈ రంగాల్లో డేటా మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్‌ విభాగాల్లో ఆఫర్లు లభించాయి. అదే విధంగా గూగుల్, ఫేస్‌బుక్‌ సంస్థలు కూడా ఎస్‌పీఓ ఆఫర్లు కల్పించాయి. 

Non Teaching Posts : సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

సేల్స్, మార్కెటింగ్‌

సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ప్రొఫైల్స్‌లోనూ గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జోరు కొనసాగింది. ముఖ్యంగా ప్రొడక్ట్‌ రీసెర్చ్, మార్కెట్‌ అనాలిసిస్‌ విభాగాల్లో విధులు నిర్వర్తించే విధంగా ఈ ఆఫర్స్‌ లభించాయి. అదే సమయంలో జనరల్‌ మే­నేజ్‌మెంట్‌ విభాగంలోనూ సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ పంథా కొనసాగింది. సంస్థలు ఈ విభాగా­ల్లో విద్యార్థులను నియమించుకునే క్రమంలో వారిలోని విశ్లేషణాత్మక దృక్పథం, మార్కెట్‌ పరిస్థితుల­పై వారికున్న అవగాహనను క్షుణ్నంగా పరిశీలించి ఆఫర్స్‌ ఇచ్చినట్లు ఐఐఎంల వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ప్రొఫైల్స్‌లో అధికంగా

ఐఐఎంల విద్యార్థులకు లభించిన జాబ్‌ ప్రొఫైల్స్‌ను గమనిస్తే ఎక్కువగా.. డేటా మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, బిజినెస్‌ స్ట్రాటజీస్‌ ప్రొఫైల్స్‌ ముందంజలో ఉన్నాయి.

Join our WhatsApp Channel (Click Here)

ఆఫర్స్‌ కారణాలు ఇవే

ఐఐఎంల్లో ఎస్‌పీఓ ఆఫర్లతోపాటు రెండు నెలల స్వల్ప వ్యవధికి రూ.లక్షల్లో స్టయిపండ్‌ ఇవ్వడానికి ఈ క్యాంపస్‌ల విద్యార్థులకు రియల్‌ టైమ్‌ నైపుణ్యాలు, అప్‌డేటెడ్‌ నాలెడ్జ్‌ ఉంటుందని సంస్థలు భావించడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ బోధన విధానాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. కార్పొరేట్‌ లీడర్లను తీర్చిదిద్దే విధంగా రియల్‌ టైమ్‌ కేస్‌ స్టడీస్‌ విధానంలో ప్రాక్టికల్‌ బోధన లభిస్తుంది. అందుకే ఐఐఎంల విద్యార్థులకు ఎస్‌పీఓలు ఇచ్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. 

కార్పొరేట్‌ కెరీర్‌కు మార్గం

ఎస్‌పీఓ అవకాశం అందుకున్న విద్యార్థులు శిక్షణ సమయంలో చూపే పనితీరు ఆధారంగా ఆయా సంస్థల్లో శాశ్వత కొలువులు అందుకునే అవకాశం ఉంది. ఇంటర్న్‌షిప్‌ చేసిన సమయంలో తమకు కేటాయించిన విధులు, విభాగాల్లో సామర్థ్యాలను, నైపుణ్యాలను ప్రదర్శించి మెరుగ్గా రాణిస్తే.. ఫైనల్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ దాదాపు ఖరారైనట్లేననే చెబుతున్నారు. ఇలాంటి అభ్యర్థులు ద్వితీయ సంవత్సరం చివర్లో నిర్వహించే ఫైనల్‌ ప్లేస్‌మెంట్‌ ప్రక్రియలో పాల్గొనకుండానే కొలువు సొంతం చేసుకోవచ్చు.

Contract Jobs : ఈడీసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు

ఫైనల్‌ ప్లేస్‌మెంట్స్‌

2024–26 బ్యాచ్‌ విద్యార్థులకు ఫైనల్‌ ప్లేస్‌మెంట్‌ ప్రక్రియ గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. పలు సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని, వాటికి మేనేజ్‌మెంట్‌ నిపుణుల అవసరం ఏర్పడుతోందని చెబుతున్నారు. అందుకే రియల్‌ టైమ్‌ నైపుణ్యాలున్న యువతను ముందుగానే గుర్తించేందుకు ఎస్‌పీఓ ఆఫర్లు ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇంటర్న్‌షిప్‌ సమయంలో చూపిన ప్రతిభ ఆధారంగా.. మంచి వేతనాలతో ఫైనల్‌ ప్లేస్‌మెంట్స్‌ ఆఫర్స్‌ ఇచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Join our Telegram Channel (Click Here)

#Tags