TET, DSC Free training : TET, DSC కి ఉచిత శిక్షణ ఎక్కడంటే..

Dsc free training

సీతంపేట: టెట్‌, డీఎస్సీ ఉచిత శిక్షణకు గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్‌కుమార్‌ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, భామిని మండలాలు.. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల గిరిజన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Click Here: మహిళలకు Good News ఉచితంగా కుట్టుమిషన్‌లు

శిక్షణకు ఎంపికై న వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు స్టడీ మెటీరియల్‌ అందజేస్తామన్నారు. ఈనెల 11 లోగా స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో టెట్‌ అర్హత పరీక్ష, కులధ్రువీకరణ, విద్యార్హత సర్టి ఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 89784 55324, 99493 96527 నంబర్లను సంప్రదించాలని కోరారు.

#Tags