Hostel Inspection: హాస్టల్‌ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి..

విద్యార్థల హాస్టల్‌ని సందర్శించిన విద్యార్థి పరిషత్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థులను వారికి ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు..

లోకేశ్వరం: ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొట్టూరి ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను గురువారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎస్సీ హాస్టల్‌లో రెగ్యులర్‌ వార్డెన్‌ను నియమించాలన్నారు.

Jobs with Study: ప్రభుత్వ కళాశాలలో కేరీర్‌ ప్లానింగ్‌పై కార్యశాల

విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని కోరారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. విద్యార్థుల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆయన వెంట నిర్మల్‌ పట్టణ కన్వీనర్‌ జాదవ్‌ మిథున్‌ ఉన్నారు.

Prime Minister's Awards for Excellence: ఏపీకి ప్రైమ్‌ మినిస్టర్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

#Tags