Govt School Teachers : ప్రభుత్వ టీచర్లకు వార్నింగ్.. ఇకపై స్కూళ్లలో ఇవి పాటించాల్సిందే..
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు విధుల్లో ఉండడంలేదని అధికారులకు సమాచారం వచ్చింది. ఈ మెరకు ప్రభుత్వ ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాఠశాలకు హాజరైయ్యే ఉపాధ్యాయుల ఫోటోలను ప్రదర్శించాలని నిర్ణయించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, డీఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 100 శాతం అమలైయ్యేలా చర్యలు చేపట్లాలని స్పష్టం చేశారు.
Job Opportunities: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.15వేల వేతనం
విధుల్లోంచి గైర్హాజురు..
పాఠశాలల్లో హాజరై విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుండానే హాజరు చూపుతూ వేతనం తీసుకున్న ఘటనలు, మరికొందరు పాఠశాలలకు రాకుండానే కొన్ని సంవత్సరాల పాటు జీతాలు తీసుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎవరెవరు పని చేస్తున్నారో వారి ఫొటోలను పదర్శిస్తే స్పష్టత వస్తుందని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.
Indian Students : అమెరికాలో భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య.. తొలిసారిగా.. కారణం ఇదే..?
ఇదిలా ఉంటే, మరోవైపు.. మా పాఠశాలలో టీచర్లు క్వాలిఫైడ్ ఉన్నారని, అర్హులు మాత్రమే పని చేస్తున్నారని పలు స్కూళ్లు యాజమాన్యాలు ప్రభుత్వానికి వివరాలు సమర్పిస్తున్నాయి. అయినప్పటికీ, పలు స్కూళ్లలో అర్హత లేని వారు ఉపాధ్యాయుల ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నందుకు, ప్రైవేటు పాఠశాలల్లో కూడా టీచర్ల ఫొటోలు ప్రదర్శించేలా నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)