Startup Competition : ఐఐసీ ఆధ్వర్యంలో స్టార్టప్ కాంపిటీషన్.. విద్యార్థుల నూతన ఆలోచనల ప్రోత్సాహకం..
పెదకాకాని: విద్యార్థులలో దాగి ఉన్న నూతన ఆలోచనలను ప్రోత్సహించడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా స్టార్టప్‌ల (అంకుర సంస్థల) ఏర్పాటుకు మార్గదర్శకం చేయడానికి వీవీఐటీ కళాశాలలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐ.ఐ.సి) ఆధ్వర్యంలో స్టార్టప్ కాంపిటిషన్’ నిర్వహించినట్లు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు.
Teachers Day: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తుల ఆహ్వానం
పెదకాకాని మండలంలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఈ పోటీలలో విద్యార్థులు 20 బృందాలుగా ఏర్పడి ఆలోచనలు, మార్కెటింగ్ అవకాశాలు, పరస్పర ప్రయోజనాలు, పెట్టుబడులు ఇతర అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను వివరణాత్మకంగా ప్రదర్శించారు. కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ పిల్లలు దూరంగా ఉండే తల్లిదండ్రులు వైద్యసహాయం కోసం ‘పికప్ హాస్పిటల్ డ్రాప్ (పి.హెచ్.డి)’ పేరుతో రూపొందించిన బోధిధర్మా టీమ్ ప్రదర్శన ఆలోచింపజేసిందని పేర్కొన్నారు.
DPED And BPED Results Out: డీపీఈడీ, బీపీఈడీ ఫలితాలు విడుదల
నిషేధిత వస్తువుల వివరాలను తెలియజేస్తూ విద్యార్థులు రూపొందించిన ‘ప్రొడక్ట్ ఎవేర్నెస్’ యాప్ ఆకట్టుకుందన్నారు. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య బోధన, బోధనేతర వనరుల సమీకరణ అందించేలా రూపొందించిన ప్రదర్శన మొదటి బహుమతి గెలుచుకున్నట్టు వివరించారు. అనంతరం ఈ పోటీలలో పాల్గొని తమ ఆలోచనలను ప్రదర్శించిన విద్యార్థులను చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జునరెడ్డి అభినందించారు.