Semester Instant Exams: డిగ్రీలో తప్పిన విద్యార్థులకు ఇన్‌స్టంట్‌ ఎగ్జామ్స్‌.. ఫీజు వివరాలు ఇవే

తిరుపతి సిటీ: ఎస్వీయూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు సంబంధించి 5వ సెమిస్టర్‌ పరీక్షలో తప్పిన విద్యార్థులకు ఇన్‌స్టంట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్వీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ దామ్లానాయక్‌  ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ అన్ని కోర్సులకు సంబంధించిన 5వ సెమిస్టర్‌ ఫలితాలను ఈనెల 7వ తేదీన విడుదల చేశామన్నారు.

సబెక్ట్‌లలో తప్పిన విద్యార్థులు ఈనెల 21లోపు పరీక్ష ఫీజును చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు. ఒక్క సబెక్ట్‌లో తప్పిన విద్యార్థులు రూ.3 వేలు, రెండు సబ్జెక్ట్‌లలో తప్పిన వారు రూ.4500, మూడు సబ్జెక్టులకు గాను రూ.5వేలు, నాలుగు సబ్జెక్టులకు రూ.5,500, ఐదింటికి రూ.6 వేలు, ఆరు సబ్జెక్టులకు రూ.6500 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

DOST 2024 Admissions: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు కొనసాగుతున్న దోస్త్‌ దరఖాస్తులు.. ఆ కోర్సులకు డిమాండ్‌

యూనియన్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ 103210100016716కు ఆన్‌లైన్‌ చలానా ద్వారా మాత్రమే విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించారు. వివరాలతో పాటు ఎస్వీయూ పరీక్షల విభాగంలో అందుబాటులో ఉన్న దరఖాస్తుకు జతపరిచి సిబ్బందికి అందజేయాలని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో, చిత్తూరు పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, మదనపల్లె బీటీ కళాశాలలో మాత్రమే ఇన్‌స్టంట్‌ పరీక్షను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.

 

 

#Tags