Sports School Admission Competitions : క్రీడాపాఠ‌శాల‌లో ప్ర‌వేశాల‌కు ఎంపిక‌ పోటీలు.. ఈ త‌ర‌గ‌తి విద్యార్థులు అర్హులు..

ఈ నెల 28న నిర్వ‌హించ‌నున్న ఎంపిక పోటీల గురించి అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ అపూర్వ్‌చౌహాన్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో తెలిపారు..

గద్వాల: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అడిషనల్‌ కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం క్రీడా పాఠశాలలకు సంబంధించిన పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌ మాట్లాడుతూ 8–9 ఏళ్లలోపు బాలబాలికలు క్రీడా పాఠశాలల్లో నాల్గవ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 28న ఇండోర్‌ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Digital lesson: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు

అంతకుముందు మండల స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చిన 15–25 మంది బాలబాలికలను ఎంపిక చేస్తారన్నారు. 3వ తరగతి పూర్తి చేసి, 01–09 2015 నుంచి 31–08–2016 మధ్యన జన్మించిన వారు అర్హులన్నారు. వివిధ క్రీడాంశాలలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఎంపిక పోటీలక హాజరయ్యే విద్యార్థులు తమ వెంట పాఠశాల బోనఫైడ్‌ సర్టిఫికేట్‌, 3వ తరగతి ఉత్తీర్ణత పత్రం, అధికారులు జారీ చేసిన కుల, పుట్టిన తేదీ ధ్రువ పత్రాలు, పది పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌, ఒరిజినల్‌ రెండు తీసుకురావాలని సూచించారు.

Two Sessions Admissions : డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌లో రెండు సెషన్లుగా ప్రవేశాలు.. ఈ ఏడాది నుంచే అమలుకు యూజీసీ లేఖలు!

జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు జూలై నెలలో రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్కడ ఎంపికైన విద్యార్థులకు క్రీడా పాఠశాలల్లో నాల్గవ తరగతిలో ప్రవేశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఇందిర, డీవైఎస్‌ఓ బీఎస్‌ ఆనంద్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జితేందర్‌, ఎంఈఓ సురేష్‌, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ESCI New Courses: ఎస్కీలో నాలుగుకొత్త కోర్సులు..ఆగస్టు నుంచే క్లాసులు, ఫీజు వివరాలు ఇవే

#Tags