Open School Admissions: ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

నారాయణపేట రూరల్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆద్వర్యంలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ ఎండీ అబ్దుల్‌ ఘని ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబర్‌ 10వరకు గడువు ఉంటుందని, టెన్త్‌ పరీక్షకు వారు గతంలో చదివిన బోనోఫైడ్‌, టీసీ, రికార్డు షీట్‌, ఇంటర్‌ పరీక్షకు పదో తరగతి పాస్‌ అయిన సర్టిఫికేట్‌ ఉండాలని తెలిపారు. దీంతోపాటు కుల, ఆదాయం, ఆదార్‌కార్డు, ఫొటోలు జత చేయాలని తెలిపారు.

NEET UG 2024: మరో రెండు రోజుల్లో నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌.. అక్కడ సీటు కావాలంటే భారీగా ఫీజు

ఒకే ఏడాదిలో పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుందని, పదోన్నతులు, ఇతర ఉన్నత విద్యా అవకాశాల కోసం అవసరమైన వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని, మరిన్ని వివరాలకు దగ్గరలోని స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని తెలిపారు.

#Tags