AP Govt Schools : ఇక‌పై స‌ర్కారు బ‌డుల్లో తెలుగు మీడియం మాత్ర‌మేనా..!

ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్‌ మీడియం తొలగించి కేవలం తెలుగు మీడియం మాత్రమే అమలు చేస్తారనే భయంతో సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరంలో గణనీయంగా తగ్గింది.

భీమవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని గతంలో వ్యతిరేకించడంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా తెలుగు మీడియం అమలు చేయాలని పట్టుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఉంటుందా.. లేదా.. అనే సందిగ్ధంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. దీంతో వారి పిల్లలను ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించారు.

ITI Second Phase Counselling : ఐటీఐల్లో ప్ర‌వేశానికి రెండో విడ‌త కౌన్సెలింగ్‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వంలో విద్యావిప్లవం తీసుకువచ్చారు. పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించేలా అమ్మఒడి అందిచడంతో పాటు ఇంగ్లిష్‌ మీడియం విద్యను చేరువ చేశారు. అలాగే నాడు–నేడులో కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. విద్యాకానుక, డిజిటల్‌ విద్యాబోధన, ట్యాబ్‌ల పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాలతో పిల్లలను బడిబాట పట్టించారు. మారుమూల గ్రామాల్లోని హైస్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేసి ఇంటర్‌ విద్యాబోధనను బాలికలకు చేరువ చేశారు. దీంతో పదో తరగతి తర్వాత చదువుకు స్వస్తి చెప్పిన వేలాది మంది బాలికలు ఇంటర్‌ విద్యను అభ్యసించారు.

Erranna Vidya Sankalpam : ముగిసిన ఎర్ర‌న్న విద్యా సంక‌ల్పం ప‌రీక్ష‌..

1,350 ప్రభుత్వ పాఠశాలలు

జిల్లాలో దాదాపు 1,853 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం సుమారు 2.21 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. 1,350 సర్కారీ బడుల్లో గతేడాది సుమారు 1.05 లక్షల మంది వి ద్యార్థులు ఉండగా ప్రస్తుతం 1.02 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇందుకు ఇంగ్లిష్‌ మీడియం తొ లగిస్తారనేది ఒక కారణంగా చెబుతున్నారు. రా నున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తారా.. లేదా అనే సందిగ్ధత అంతటా నెలకొందని ఉపాధ్యాయులు అంటున్నారు.

Students and Teachers Bond : అధ్యాప‌కుల‌పై విద్యార్థుల భావోద్వేగం.. వెళ్లొద్దంటూ క‌న్నీళ్లు!

#Tags