ITI Second Phase Counselling : ఐటీఐల్లో ప్రవేశానికి రెండో విడత కౌన్సెలింగ్.. దరఖాస్తులకు చివరి తేదీ!
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐ)లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో మిగులు సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అర్హులైన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 3 ప్రభుత్వ, 20 ప్రైవేట్ ఐటీఐలు ఉండగా, విద్యార్థులు ఎంచుకున్న ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్ ఎల్.సుధాకర్‌రావు సూచించారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అప్‌లోడ్ చేసిన ధ్రువీకరణ పత్రాలతో సమీప ప్రభుత్వ కళాశాలల్లో 25వ తేదీలోపు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలి. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థు లు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారు. 26వ తేదీన కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించి, సీట్లు కేటాయించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 23 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 3608 సీట్లు ఉండగా, 826 ప్రవేశాలు జరిగాయి. 2782 మిగులు సీట్లు ఉన్నాయి.