Samanvaya 2024 : హెచ్ఎస్ఎస్సీ ఆధ్వ‌ర్యంలో స‌మ‌న్వ‌య 2024.. జాతీయ స‌ద‌స్సు..

’హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో ’సమన్వయ 2024’ పేరుతో జాతీయ సదస్సును బంజారాహిల్స్‌లో నిర్వహించారు.

బంజారాహిల్స్: మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక విద్యావిధానాలతో పాఠశాలలను ఎలా సిద్దం చేయాలనే అంశంపై నిర్వాహకులు దృష్టి సారించాలని యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ సూచించారు. ’హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో ’సమన్వయ 2024’ పేరుతో జాతీయ సదస్సును బంజారాహిల్స్‌లో నిర్వహించారు.

 

తెలంగాణ రాష్ట్రంలోని 281 సీబీఎస్ఈ స్కూళ్లకు చెందిన ప్రిన్స్పల్స్. అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో సరికొత్త విద్యావిధానాలు, మారుతున్న పరిస్థితులు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ మాట్లాడుతూ..గ్లోబల్ ఎడ్యుకేషన్ విధానానికి అనుగుణంగా విద్యాబోధనను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 

దీనికోసం స్కూళ్లలో ఏర్పాటు చేసుకోవాల్సిన మౌళిక సదుపాయాలు, పరిశోధనలపై దృష్టి పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో విద్యావ్యవస్థలో రానున్న మార్పులకు సన్నద్ధం చేయడంలో ఇలాంటి సదస్సులు ఎంతో దోహదం చేస్తాయన్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ఈ కార్యక్రమంలో ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ అజంతా సేన్, ఐఐఎమ్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ కాథన్ దుష్యంత్ శుక్లా, హెచ్ఎస్ఎస్ సీ చైర్మన్ అమీర్ ఖాన్, వైస్ చైర్పర్సన్ డా. ఎబెనీజర్, సెక్రెటరీ రోజా పాల్,డా. సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

 

#Tags