Acharya Nagarjuna University: ఏఎన్‌యూతో నాట్కో ఎంఓయూ
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో నాట్కో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఎంఓయూ(అవగాహనా ఒప్పందం) కుదుర్చుకుంది.
యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.రాజశేఖర్ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య బి. కరుణ, నాట్కో స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ మదన్ కుమార్‌లు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. ఎంఓయూలో భాగంగా ఏఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విభాగం, వర్సిటీ సినిమా, ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్, టీవీ బోధన సిబ్బంది, విద్యార్థి కళాకారుల చేత నాట్కో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ జి.అనిత, స్కూల్ ఆఫ్ ఫెర్పార్మింగ్ ఆర్ట్స్ అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జే మధుబాబు ఉన్నారు.
చదవండి: APSCHE Chairman: న్యాయ విద్యార్థులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి
#Tags