Model Schools Admissions 2025 : మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు ఇవే..!
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతితోపాటు 7-10 తరగతుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
CBSE Schools Breaking News: సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీల్లో దొరికిన డమ్మీ విద్యార్థులు!
2025 -26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కల్పించనున్నారు తెలంగాణ మోడల్ స్కూల్. వచ్చే సోమవారం అంటే, డిసెంబర్ 23వ తేదీన అడ్మిషన్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
మోడల్ స్కూల్ ప్రవేశాల 2025-2026:
ప్రవేశాలు కల్పించే తరగతులు - 6, 7, 8, 9, 10.
దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు ప్రారంభం - జనవరి 06, 2025
దరఖాస్తులకు తుది గుడువు - ఫిబ్రవరి 28, 2025
దరఖాస్తుల రుసుము- ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
Schools and Colleges Holidays : నెలాఖరిలో సెలవులే సెలవులు.. ఇక విద్యార్థులకు పండగే.. ఎన్నిరోజులంటే..!
హాల్ టికెట్లు డౌన్లోడ్ - ఏప్రిల్ 03, 2025
పరీక్ష తేదీ - ఏప్రిల్ 13, 2025
వెబ్ సైట్ - https://telanganams.cgg.gov.in
మరోవైపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం 2025 - 26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
15 Holidays for Schools and Colleges : స్కూల్స్, కాలేజీలకు 15 రోజులు సెలవులు.. ఎందుకంటే..!
23 ఫిబ్రవరి 2025 ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాలలో 5వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నారు. అధికారులు ఎంపిక చేసి, ఏర్పాట్లు చేసిన పరీక్షా కేంద్రాలలోనే ఈ ప్రవేశ పరీక్ష జరుగనుంది. ఈ పరీక్ష కోసం విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. https://tgswreis.telangana.gov.in/ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)