School Time : మ‌ధ్యాహ్న‌మే ఈ స్కూల్‌కు లాస్ట్ బెల్‌..!

సోమ, మంగళ, బుధ ఏ రోజైనా ఆ స్కూల్‌కు రోజూ ఒంటిపూట బడే.

రాజంపేట: మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు.. ఆ హైస్కూల్‌లో ఫైనల్‌ బెల్‌ కొట్టేస్తారు. వేసవి సహా కాలం ఏదైనా.. సోమ, మంగళ, బుధ ఏ రోజైనా ఆ స్కూల్‌కు రోజూ ఒంటిపూట బడే. అన్నమయ్య జిల్లా నందలూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఒంటిపూటే నడిచే ఏకైక హైస్కూల్‌గా రికార్డులకెక్కింది. 1908లో నందలూరులో బోర్డు హైస్కూల్‌ ఏర్పాటైంది. 1954లో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌.. ఆ తర్వాత 1962లో జిల్లా హయ్యర్‌ సెకండరీ హైస్కూల్‌గా ఆవిర్భవించింది.

New Fish Species: మూడు కొత్త ర‌కం చేపలను క‌నుగొన్న శాస్త్రవేత్తలు.. ఇవి క‌నిపించేది ఈ రాష్ట్రాల్లోనే..

ఒకప్పుడు విశాలమైన గదులు, లైబ్రరీ, ల్యాబ్, క్రీడా పరికరాలతో పాటు నాణ్యమైన బోధన, ఉత్తమ ఉపాధ్యాయులతో క్రమశిక్షణకు మారుపేరుగా హైస్కూల్‌ ఖ్యాతిగాంచింది. ఎందరో ఐఏఎస్‌లను అందించి చరిత్రలో నిలిచింది. ఇక్కడి హైస్కూల్‌లో తరగతులు ఉదయం 7.45కు ప్రారంభిస్తారు. మధ్నాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. 

జూనియర్‌ కళాశాల రాకతో హైస్కూల్‌ విద్యకు గ్రహణం

నందలూరు బస్టాండు నుంచి సౌమ్యనాథ ఆల­యానికి వెళ్లే మార్గంలో విశాలమైన స్థలంలో ఈ హైస్కూల్‌ ఉంది. భవనాల కొరతతో 1982లో నందలూరులోని జూనియర్‌ కళాశాలను ఇక్కడికి మా­ర్చారు. సొంతభవనాల నిర్మాణం వరకు అని చెప్పిన ఇంటర్‌ బోర్డు నేటి వరకు ఇక్కడే కళాశాలను కొనసాగిస్తోంది. ఇక్కడి నుంచి కళాశాలను తరలించాలని జెడ్పీ హైస్కూల్‌ యాజ­మా­న్యం మొత్తుకు­న్నా.. కలెక్టర్లు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు.  274 మంది విద్యార్థులున్న ఈ హైస్కూల్‌లో మధ్యాహ్నం వరకు తరగతులు సాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇంటర్‌ విద్యను కొనసాగిస్తు­న్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

వ్యతిరేకిస్తున్న అధ్యాపకులు

ఏదో ఒక పూట వస్తున్నాం..పాఠాలు చెప్పి­పోతున్నాం.. అక్కడికి తరలిస్తే రెండు పూటలా కాలేజీకి రావాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో. ఇంటర్‌ కళాశాలను తరలింపును కొంద­రు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. మండల కాంప్లెక్స్‌ సమీపంలోని ఎస్సీ హాస్టల్‌ భవనాలు దూరమని.. అక్కడికి వెళితే ఇంటర్‌ బాలికలకు రక్షణ ఉండదని ప్రచారం చేశారు. నిజానికి మండల కాంప్లెక్స్‌ ఆవరణ ప్రశాంతంగా ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడే వందలాదిమంది బాలికలతో బీసీ గురుకుల పాఠశాల కూడా ఉంది.

APSRTC Chairman Konakalla Narayana Rao : ఆర్టీసీలో 7545 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌...త్వరలోనే...!

కేవలం తమ స్వార్థం కోసం అధ్యాపకులు చేసిన వ్యవహారం వల్ల తరలింపు ఆగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, డీఈవో, ఇంటర్‌ ఆర్‌జెడీ ఒకతాటిపైకి వచ్చి హైస్కూల్‌కు ఒంటిపూట బడి నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థులు, వారి తల్లి­దండ్రులు కోరు­తున్నారు. కాగా..­.ఐ­ఏఎ­స్‌లను.. గొప్ప రాజకీయ నా­యకులను దేశాని­కి అందించిన స్కూల్‌గా ఈ ఇది ఖ్యాతి గడించింది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags