ITI Counselling: 19, 20 తేదీల్లో ఐటీఐ కౌన్సెలింగ్‌.. ఆ సర్టిఫికేట్లతో హాజరు

నెల్లూరు (టౌన్‌): 2024–25వ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో సీట్లు కేటాయించేందుకు ఈ నెల 19, 20 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఐఐటీ కన్వీనర్‌, ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్‌ శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్థానిక వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐకు ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

AP Inter Supplementary Results Released: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 87 శాతం ఉత్తీర్ణత, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ తెలుసుకోండిలా..

19న మెరిట్‌ నంబరు 1 నుంచి 150 వరకు, పదో తరగతిలో గ్రేడ్‌ 10 నుంచి 6.8 వరకు, మధ్యాహ్నం 151 నుంచి 300 వరకు, గ్రేడ్‌ 6.8 నుంచి 5.7 వరకు, 20న మెరిట్‌ నంబరు 301 నుంచి 450 వరకు, గ్రేడ్‌ 5.7 నుంచి 4.7 వరకు, మధ్యాహ్నం మెరిట్‌ నంబరు 451 నుంచి 620 వరకు, గ్రేడ్‌ 4.7 నుంచి 1.8 వరకు కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు.

#Tags