ISO Team : ఈ విశ్వ విద్యాల‌యంలో ఐఎస్ఓ బృందం..!

యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌(ఐఎస్‌ఓ) ప్రతినిధుల బృందం సందర్శించింది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌(ఐఎస్‌ఓ) ప్రతినిధుల బృందం సందర్శించింది. తొలుత ప్రతినిధుల బృందం హెచ్‌.వై.ఎం. ఇంటర్నేషనల్‌ సీఈఓ ఆలపాటి శివయ్య, ఆడిటర్‌ టి.సుమాదేవి విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య కె. కృష్ణారెడ్డిని కలిశారు. అనంతరం రిజిస్ట్రార్‌ ఆచార్య పుత్తా పద్మ, ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి, ఐక్యూఏసీ సంచాలకులు డా. ఎల్‌. సుబ్రహ్మణ్యం శర్మ, డిప్యూటీ డైరక్టర్‌ ఎం. సుభోష్‌ చంద్ర, గ్రీన్‌ అండ్‌ ఎనర్జీ సభ్యులతో సమావేశమయ్యారు.

Semester Exam Results: డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

అనంతరం విశ్వవిద్యాలయంలోని హ్యుమానిటీస్‌ బ్లాక్‌, సైన్స్‌ బ్లాక్‌, గురుకులం భవనాలలోని డిపార్ట్‌మెంట్‌లను పరిశీలించారు. శాఖలలో జరుగుతున్న ప్రగతిని ప్రత్యక్షంగా గమనించారు. బుధవారం కూడా పరిశీలన ఉంటుందని ఐక్యూఏసీ సంచాలకులు డాక్టర్‌ సుబ్రహ్మణ్యం శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వీసీ కె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ హెచ్‌.వై.ఎం. ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రతిష్టాత్మకమైందని, అత్యున్నతస్థాయి విశ్వవిద్యాలయానికి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags