Telangana Govt: రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలకు నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ

నిర్మల్‌ రూరల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల రో జువారీ ఖర్చులకోసం ప్రభుత్వం నిధులు మంజూ రు చేసింది. ప్రతీ విద్యార్థికి సగటున రూ.71 చొప్పు న ఖర్చవుతాయని అంచనా వేసి రాష్ట్రవ్యాప్తంగా కళా శాలలకు నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత విద్యకు వారధిగా ఉండే ఇంటర్‌ క ళాశాలలో సమస్యలు పేరుకు పోతున్నాయి. నిధులు లేకపోవడంతో ఏటా ప్రవేశాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఏమాత్రం సరిపోవని అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. గతంలో కళాశాలలో చదివే విద్యార్థుల నుంచి రూ. 500 చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేసేవారు. ఈ రుసుమును కళాశాలల ఖర్చుల నిర్వహణ కోసం వాడేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తుండడంతో 2014 నుంచి విద్యార్థుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ఇటు ప్రభుత్వం సరిపడా నిధులు విడుదల చేయకపోవడం, అటు విద్యార్థుల నుంచి రుసుము వసూలు చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారుతోంది.

ఒక్కో విద్యార్థికి రూ.71..
కళాశాలల నిర్వహణ కోసం ఒక్కో విద్యార్థికి డే టు డే బడ్జెట్‌ కింద రూ .71 విడుదల చేశారు. ఈ నిధులు కేవలం కంటి తుడుపు చర్యలా భావిస్తున్నారు. జిల్లాలో 12 జూనియర్‌ కళాశాలలు ఉండగా.. అందులో 5,391 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 2,641 మంది ప్రథమ సంవత్సరం, 2,750 మంది ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ కళాశాలలకు రూ.3,00,543 నిధులు మంజూరయ్యాయి. రోజురోజుకూ ఖర్చులు పెరుగుతున్నాయని, విద్యార్థులకు ఇచ్చే మొత్తాన్ని కనీసం రూ.500 కు పెంచాలని అధ్యాపకులు కోరుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 406 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా 1,38,450 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు.

మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు..
జిల్లాలోని 12 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా 10 జూనియర్‌ కళాశాలలకు మూత్రశాలలు, మ రుగుదొడ్ల నిర్మాణాలకు రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ఇటీవల నిధులను మంజూరు చేసింది. జిల్లాలోని ముధోల్‌, బైంసా, ఖానాపూర్‌, మామడ, లోకేశ్వర, దిలావర్‌పూర్‌, కడెం, సారంగాపూర్‌, కుభీర్‌, జిల్లా నిర్మల్‌ బాలికల జూనియర్‌ కళాశాలల్లో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ప్రతీ నిర్మాణానికి రూ.4.6 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి పరశురాం తెలిపారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల కాలేజీల నిర్వహణ ఎలా..
కళాశాల నిర్వహణ అంటే అటెండెన్స్‌ రిజిస్టర్లు, చాక్‌ పీసులు, డస్టర్లు, విద్యుత్‌ బిల్లు, ఫోన్‌ బిల్లు, మంచినీళ్లు స్వీపర్‌ వేతనం, పరిసరాల పరిశుభ్ర త, బోరు మరమ్మతులు, టాయిలెట్స్‌ శుభ్రపరచ డం, జాతీయ పర్వదిన వేడుకల ఖర్చు, తదితర వాటితోపాటు కనిపించని ఎన్నో ఖర్చులు ఉంటా యి. వీటన్నింటికీ కలిపి ప్రతీనెల కనీసం రూ.6 నుంచి రూ.9 వేల వరకు ఖర్చవుతాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రవేశాలు ఏడాదికి ఏడాది తగ్గిపోతుండడంతో ఉచిత ప్రవేశాలను బోర్డు ప్రకటించింది. రెండేళ్లుగా డే టుడే బడ్జెట్‌ పేరుతో విద్యార్థులకు రూ.100 లోపు విడుదల చే స్తున్నారు. ఇవి ఎక్కువ విద్యార్థులు ఉన్న కళాశాలలు సర్దుకో వచ్చిమో కానీ.. తక్కువ సంఖ్యలో ప్ర వేశాలు ఉండే కళాశాలలకు ఇబ్బందిగా మారుతుంది. ఇంటర్‌ విద్యకు నిధుల కేటాయింపు సరి గా లేకపోవడంతో ఖర్చు సమస్యగా మారింది. చాలామంది ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

#Tags