ITI Admissions : ఐటీఐ క‌ళాశాల‌ల్లో 5వ ద‌ఫా ప్ర‌వేశాలు.. ఈ తేదీలోగా!

తిరుపతి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఐదో దఫా ప్రవేశాలకు ఆన్‌లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌, కన్వీనర్‌ వీ.శ్రీలక్ష్మి తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ‘iti.ap.gov.in’ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Teachers Training: ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం

అభ్యర్థులు తాము చేరదలచిన ఐటీఐ కళాశాలను వెబ్‌సైట్లో ఆప్షన్‌ పెట్టుకుని ఆ తరువాత సమీపంలోని ఏదేని ప్రభుత్వ ఐటీఐ కళాశాలకెళ్లి సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఈ నెల 28న ప్రభుత్వ ఐటీఐలో చేరదలచిన వారికి, 30న ప్రైవేటు ఐటీఐలో చేరదలచిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, దీనికి సంబంధించి అభ్యర్థులకు ఎటువంటి కాల్‌ లెటర్లు పంపబడవని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు 85000 21856, 94908 06942 నంబర్లలో సంప్రదించాలని కన్వీనర్‌ కోరారు. అలాగే తిరుపతి ప్రభుత్వ ఐటీఐలో వుడ్‌ వర్క్‌ టెక్నీషియన్‌ కోర్సుకు 8వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్‌ తెలిపారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags