AP Model Schools : వెలుగులోకి వ‌చ్చిన ఏపీ మోడ‌ల్ స్కూళ్ల ప‌లు స‌మ‌స్య‌లు.. విద్యార్థుల‌కు ఇబ్బందులు..

విజయనగరం జిల్లాలో 13, పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు ఏపీ మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. ప్రతి స్కూల్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకూ ఒక్కో సెక్షన్‌లో వంద మంది చొప్పున 500 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఒక్కో గ్రూప్‌లో 40 మంది వరకూ ఉన్నారు. ఆయా స్కూళ్లను శనివారం ‘సాక్షి’ బృందం పరిశీలించింది. పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.

Women Self Employment : మ‌హిళ‌ల‌కు స్వ‌యం ఉపాధి శిక్ష‌ణ‌.. ఈ విభాగాల్లోనే..

● కురుపాం మండల కేంద్రంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ వంటకు శాశ్వత భవనం లేదు. దీంతో తరగతి గదినే వంటకు వాడుతున్నారు. విద్యార్థులకు వరండాలోనే భోజనాలు వడ్డిస్తున్నారు.

●భామిని మండల కేంద్రంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో వంట గది లేదు. రేకుల షెడ్‌లో వంట చేస్తున్నారు. భోజనాల గది లేకపోవడంతో వరండాలోనే విద్యార్థులు భోజనాలు చేయాల్సిన పరిస్థితి.

World Exhibition Day : డాక్టర్‌ వైఎస్ఆర్ యూనివ‌ర్సిటీలో వ‌ర‌ల్డ్ ఫోటిగ్ర‌ఫీ డే ఎగ్జిబిష‌న్‌.. ఈ తేదీల్లోనే..

● సాలూరు మండలంలోని పురోహితునివలస మోడల్‌ స్కూల్‌లో సరైన డైనింగ్‌ హాల్‌ లేకపోవడంతో వరండాల్లోనే విద్యార్థులు భోజనం చేస్తున్నారు. పాఠశాల మార్గం సరిగా లేదు. తాగునీటి సమస్య తీరట్లేదు.

#Tags