ప్రతి విద్యార్థి ఉన్నతస్థాయికి ఎదగాలి
ధన్వాడ: క్రమశిక్షణతో చదువుకుని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని వసతిగృహల శాఖ జిల్లా అధికారి కన్యాకుమారి అన్నారు. ధన్వాడలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం సాయంత్రం వీడ్కోలు సమావేశం నిర్వహిచారు. ఈ సంద్బంగా ఆమె మాట్లాడారు. హాస్టల్‌లో ఉంటూ చదువుకుని పదో తరగతిలో 7.5పైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రభు త్వం తరఫున కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా చదువుకునే అవకాశం ఉందని తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డెన్ విజయ్, ఎంపీటీసీ మాధవి, ఉపాధ్యాయులు నరేందర్, సలీం పాల్గొన్నారు.
#Tags