Engineering Admission Counselling : ఇంజినీరింగ్‌ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి మూడో విడ‌త కౌన్సెలింగ్ పూర్తి.. ఇంత శాతంతో..

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన మూడో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఉన్నత విద్యా మండలి మంగళవారం వెబ్‌సైట్‌లో పెట్టింది. జిల్లాలో నాలుగు కళాశాలలు ఉండగా మూడో విడత 2154 కన్వీనర్‌ సీట్లకు 1765 ప్రవేశాలు జరిగాయి. మొత్తం 82 శాతం ప్రవేశాలు పూర్తయ్యాయి.

Guest Faculty Posts : ఆంధ్రా యూనివ‌ర్సిటీలో గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టుల నియామ‌కాలు..

మొదటి విడతలో 1847, రెండో విడతలో 1903 ప్రవేశాలు జరిగాయి. టెక్కలి ఐతం 1104 సీట్లకు 1001, చిలకపాలెంలో శివానీలో 384 సీట్లకు 291, ఎచ్చెర్ల శ్రీ వేంకటేశ్వరా కళాశాలలో 336కి 228, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 330కి 245 ప్రవేశాలు జరిగాయి. విద్యార్థులు ఈ నెల 30లోపు కళాశాల్లో చేరాల్సి ఉంటుంది.

#Tags