Employment Opportunity : స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ శిక్ష‌ణ పొందిన వారికి ఉపాధి క‌ల్పించాలి

తిరుపతి: జిల్లాలోని పాలిటెక్నిక్‌ డిప్లొమా, ఐటీఐ కాలేజీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నేతృత్వంలో శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సమీపంలోని పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

ITI Admissions : ఐటీఐ క‌ళాశాల‌ల్లో 5వ ద‌ఫా ప్ర‌వేశాలు.. ఈ తేదీలోగా!

విద్యార్థులు శిక్షణ పొందుతున్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను సమీపంలోని పరిశ్రమలకు మ్యాపింగ్‌ చేయాలన్నారు. ఆ మేరకు కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత అదే పరిశ్రమల్లో విద్యార్హతను బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి ఆర్‌.లోకనాథం, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, మెప్మా పీడీ రాధమ్మ, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags