Polytechnic Courses: పాలిటెక్నిక్ కోర్సుల‌తో ఉపాధి అవ‌కాశాలు..

ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం నిర్వ‌హించిన‌ జాబ్‌ అచీవర్స్‌డేలో ఆర్‌డీవో మనోజ్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు..

పలమనేరు: ఉపాధి, ఉద్యోగాలకు పాలిటెక్నిక్‌ కోర్సులు దగ్గరి దారిలా మారాయని పలమనేరు ఆర్‌డీవో మనోజ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణ సమీపంలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం జాబ్‌ అచీవర్స్‌డేను నిర్వహించారు. ఆయన ముఖ్య అతిధిగా హాజరై వివిధ కంపెనీలో ఉద్యోగాలను సాధించిన వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్‌లో ఉపాధికి మెండైన అవకాశాలున్నాయన్నారు. చిన్న వయస్సులో ఉద్యోగాలను సాధించి ఆపై ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు ఇదో మంచి మార్గమన్నారు.

DYEO Posts: నేడు డీవైఈఓ పోస్టుల‌కు ప‌రీక్ష‌..

కాబట్టి త్వరగా సెటిల్‌ కావాలనుకునేవారు పదోతరగతి తర్వాత పాలిటెక్నిక్‌ కోర్సులను చేయాలని సూచించారు. కళాశాలకు చెందిన ఫైనలియర్‌ విద్యార్థినిలు 70మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. విస్ట్రాన్‌, అనీజా కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపాల్‌ మహమూద్‌, విభాగాధిపతులు లక్ష్మీప్రసన్న, శ్రీవిద్య, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జయపాల్‌, సీనియర్‌ అధ్యాపకులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

New Courses in SKU: టెక్నాలజీ విప్లవంతో సరికొత్త ఉపాధి అవకాశాలు

#Tags