China's Kinder Garten Schools : చైనాలో భారీగా త‌గ్గుతున్న జ‌నాభా సంఖ్య‌.. మూత‌ప‌డుతున్న చిన్నారుల పాఠ‌శాల‌లు!

ఒక‌ప్పుడు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన చైనా నేడు జ‌నాభా త‌గ్గుద‌ల‌తో ఒక్క‌ట్లు ప‌డుతోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఒక‌ప్పుడు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన చైనా నేడు జ‌నాభా త‌గ్గుద‌ల‌తో ఒక్క‌ట్లు ప‌డుతోంది. అక్క‌డ జ‌న‌నాల సంఖ్య భారీగా త‌గ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగింది. ఏ దేశ‌మైనా పాఠ‌శాల‌లో చిన్నారుల‌కు ఆటాపాట‌ల‌తో చ‌దువును చెప్పేది LKG, UKG త‌ర‌గ‌తులే. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు 4 లేదా 5 సంవ‌త్స‌రాల‌కు వ‌స్తే చాలు ఈ త‌ర‌గ‌తుల్లో వేస్తే వారికి ఆట‌లు, చ‌దువులు రెండూ ఉంటాయ‌ని జాయిన్ చేస్తారు. అయితే, చైనాలోని జ‌నాభా సంఖ్య‌లో వ‌స్తున్న మార్పులు, పిల్ల‌లు లేకపోవ‌డం వంటి కార‌ణాల చేత‌ LKG, UKG పాఠ‌శాల‌లు వేల సంఖ్య‌లో మూత ప‌డుతున్నాయి. 

Best Schools: ప్రపంచ అత్యుత్తమ పాఠశాలల్లో మూడు భార‌త‌దేశానివే..

జనాభా పరంగా చైనా రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జననాల, సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోగా.. మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. 2023 నాటికి 60ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా.. 2035 నాటికి ఈ సంఖ్య 40కోట్లు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. ఒక‌ప్పుడు పిల్ల‌లు వ‌ద్దంటూ నియంత్రించిన స‌ర్కారే నేడు క‌న‌మ‌ని వేడుకుంటున్నా.. ఆర్థిక ఇబ్బందుల్ని త‌ట్టుకోలేక చైనీయులు పిల్ల‌ల్ని క‌న‌డం లేదు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

దేశవ్యాప్తంగా 2023లో 14,808 కిండర్‌ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11.55 శాతం (5.35 మిలియన్లు) తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది. మొత్తం 2,74,400 కిండర్‌గార్టెన్లు ఉండగా.. ప్రస్తుతం 2,59,592 మాత్రమే పనిచేస్తున్నాయని నివేదిక వివరించింది. 

AP UNICEF Project News: విద్యార్థులను ఉత్తమ భవిష్యత్‌ కు నేటి నుంచి యునిసెఫ్ ప్రాజెక్టు

 

#Tags