Diploma in Pharmacy Courses: డీఫార్మసీ కోర్సులో ప్రవేశాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో రెండేళ్ల కాల పరిమితి గల డీ ఫార్మసీ కోర్సులో 2024–25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.ప్రభాకరరావు మే 22వ తేదీ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల కేటాయింపునకు జూన్‌ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఇంటర్‌ రెగ్యులర్‌తోపాటు దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డు నుంచి తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 98480 38769, 99593 24563, 93986 20953 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ ఎస్‌.ప్రభాకరరావుసూచించారు.

Latest inter news: ఇంట‌ర్ అర్హ‌త‌తోనే.. ఉన్నతస్థాయి ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌..

#Tags