Medical College Development: వైద్య క‌ళాశాల అభివృద్ధిలో ఏపీ సీఎం కృషి..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. సీఎం జ‌గ‌న్ చేసిన విప్ల‌వాత్మ‌క మార్పులు ఇవే..

గుంటూరు: ఆణిముత్యాల్లాంటి ఎందరో వైద్యులను ప్రపంచానికి అందించిన ఘనత దక్కించుకున్న గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. అదనంగానూ పోస్టులు మంజూరు చేశారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారు. 52 పీజీ సీట్లు వైద్య కళాశాలకు తీసుకొచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతోంది. ఆయన పాలనలో వైద్యకళాశాల సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.

Certificate Courses: వ్యవసాయ విద్యకు సర్టిఫికెట్‌ కోర్సులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

చరిత్ర ఘనమే

గుంటూరు వైద్య కళాశాల 1946లో ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న వైద్యులు కనిపిస్తారు. భారతదేశంలో ఏర్పాటైన తొలి రెండు వైద్య కళాశాలల్లో గుంటూరు ఒకటి. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆచంట రుక్మిణమ్మ కృషి ఫలితంగా ఆంధ్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చొరవతో గుంటూరు వైద్య కళాశాల ఏర్పాటైంది. ఎంతో మంది రాజకీయ నాయకులను అందించిన ఘన చరిత్ర కలిగిన గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి గతంలో ఎవరూ చూపని చొరవను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపించారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవిగో సీఎం చేసిన విప్లవాత్మక మార్పులు

● గుంటూరు వైద్య కళాశాల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే ఏడాదిలో 34 పీజీ సీట్లు మంజూరు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతోంది. ఈ ఐదేళ్లలో మొత్తం 52 పీజీ సీట్లు కళాశాలకు మంజూరు చేయడం విశేషం.

● గుంటూరు వైద్య కళాశాల ఏర్పడి 75 ఏళ్లు గడిచినా ఎంతో కీలకమైన ప్రిన్సిపాల్‌ పోస్టుకు అడిషనల్‌ డీఎంఈ హోదా లేదు. దీనివల్ల నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తనిఖీల సమయంలో అడిషనల్‌ డీఎంఈ హోదా లేని ప్రిన్సిపాల్‌ వల్ల ఇబ్బందులు పడేవారు. దీనిని గుర్తించిన సీఎం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ పోస్టుకు అడిషనల్‌ డీఎంఈ హోదాకల్పించారు.

● గతంలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ప్రమోషన్లు లేక అవస్థలు పడేవారు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక కళాశాల బోధనా సిబ్బంది, అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు.

PM SHRI: పాఠశాలలకు మహర్దశ

● ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేశారు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, రోగులకు సత్వర మెరుగైన చికిత్సలు అందించేందుకు అదనంగా పోస్టులనూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

● ప్రొఫెసర్లు 15, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 15, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 31 పోస్టులు నూతనంగా మంజూరు చేసి అరుదైన రికార్డును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సృష్టించారు.

● వైద్య కళాశాలలో సుమారు 25 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 32 పారా మెడికల్‌ పోస్టులు భర్తీ చేసి అదనంగానూ పోస్టులు మంజూరు చేశారు. మెడికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎమర్జన్సీ మెడిసిన్‌ వైద్య విభాగాలను నూతనంగా మంజూరు చేశారు. పలు వైద్య విభాగాల్లో అదనంగా యూనిట్లు మంజూరు చేశారు.

Paytm Layoffs: పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్‌.. త్వరలోనే లేఆఫ్స్‌

నిధులు మంజూరు

గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య కళాశాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రూ.500 కోట్లు మంజూరు చేశారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఛాతి, సాంక్రమిత వ్యాధుల ఆస్పత్రి అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారు. వైద్య కళాశాలలో పీజీ సీట్లకు వసతులు కల్పించేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. మైక్రో బయాలజీ, పెథాలజీ, బ్లడ్‌బ్యాంక్‌, డెర్మటాలజీ వైద్య విభాగాల్లో కోట్లాది రూపాయలతో వైద్య పరికరాలు అందజేశారు.

అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక కృషి ప్రత్యేకంగా రూ.500 కోట్లు మంజూరు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 52 పీజీ సీట్లు కేటాయింపు నూతనంగా వైద్య విభాగాల ఏర్పాటుకు చర్యలు వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ.

School Teachers: ఉపాధ్యాయుల‌కు రెండురోజుల శిక్ష‌ణ‌..!

#Tags