Course and Jobs : ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ విద్యకు ప్రసిద్ధ విద్యాసంస్థలు.. ఈ కోర్సుల‌తో ఉన్న‌త కొలువులు!

ఐఐటీలు, ఐఐఎంలు.. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ విద్యకు ప్రసిద్ధ విద్యాసంస్థలు! వీటిలో చేరి కోర్సు పూర్తి చేసుకుంటే.. కార్పొరేట్‌ కొలువులు, కళ్లు చెదిరే వేతనాలు ఖాయమనే అభిప్రాయం! రూ.లక్షలు, వీలైతే కోట్లలో వార్షిక వేతనాలతో కొలువు సొంతం చేసుకోవచ్చనే అభిలాష!!

కానీ.. ఈ ఏడాది (2023–24) ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులకు కొంత భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఐఐఎంల్లో ఆఫర్లు ‘ఒకే’ అనిపించేలా ఉన్నా.. ఐఐటీల్లో మాత్రం బాగానే తగ్గుదల కనిపించింది!! ఈ నేపథ్యంలో.. 2023–24 బ్యాచ్‌లో ఐఐటీలు, ఐఐఎంల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ట్రెండ్స్‌పై కథనం.. 

ఐఐటీల్లో 2024 బ్యాచ్‌ క్యాంపస్‌ ఆఫర్లలో తగ్గుదల కనిపించింది. తాజా గణాంకాలను పరిశీ లిస్తే.. 30 శాతం మంది విద్యార్థులకు ఇంకా ఆఫర్లు అందాల్సి ఉంది. మొత్తం 23 ఐఐటీల్లో మొత్తం 21,500 మంది క్యాంపస్‌ డ్రైవ్స్‌కు దరఖాస్తు చేసుకోగా.. వారి లో 6,500 మంది ఆఫర్ల కోసం నిరీక్షిస్తున్నట్లు సమాచారం.  
అంతర్జాతీయ పరిస్థితులు
ఐఐటీల్లో క్యాంపస్‌ డ్రైవ్స్‌లో తగ్గుదలకు ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పలు దేశాల్లో ఆర్థిక మందగమనం, అమెరికా ఎన్నికలు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తదితర కారణాలతో సంస్థలు నూతన నియామకాల విషయంలో వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఐటీల్లో ఇంటర్నేషనల్‌ ఆఫర్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగానే పడినట్లు చెబుతున్నారు. 
Join our Telegram Channel (Click Here)
ఏఐ, చాట్‌ జీపీటీ ఎఫెక్ట్‌
ఐఐటీల్లో క్యాంపస్‌ డ్రైవ్స్‌పై ఏఐ, చాట్‌ జీపీటీ ప్రభావం సైతం పడిందనే వాదన వినిపిస్తోంది. చాట్‌ జీపీటీ, ఏఐ టూల్స్, జెన్‌ ఏఐ వంటి సాంకేతికతల కారణంగా.. ముగ్గురు చేసే పనిని ఇద్దరు పూర్తి చేస్తున్నారు. దీంతో సహజంగానే నియామకాల్లో  20 నుంచి 30 శాతం మేరకు కోత పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
జాబ్‌ రెడీ స్కిల్స్‌
ఐఐటీల్లో ఆఫర్లు తగ్గడానికి జాబ్‌ రెడీ స్కిల్స్‌ లేమి కూడా కారణమని చెబుతున్నారు. విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు 80 శాతం మేరకే ఉంటున్నాయని పేర్కొంటున్నారు. విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ సమ యంలో కోర్‌ నైపుణ్యాలకే ప్రాధాన్యమిస్తున్నారని.. రియల్‌ టైమ్‌ ఎక్స్‌పోజర్‌పై దృష్టి పెట్టడం లేదని, ఇదే జాబ్‌ రెడీ స్కిల్స్‌ కొరతకు కారణమవుతోందని అంటున్నారు.
Teaching Posts : ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీలో టీచింగ్‌ పోస్టులు.. అర్హులు వీరే..
డిమాండింగ్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌
ఐఐటీ క్యాంపస్‌ డ్రైవ్స్‌లో జాబ్‌ ప్రొఫైల్స్‌ను పరిశీ లిస్తే.. కోర్‌ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ అండ్‌ ప్రోగ్రామర్స్, డేటా అనలిస్ట్స్, యుఎక్స్‌ డిజైన ర్, ప్రొడక్ట్‌ డిజైనర్, ఫుల్‌స్టాక్‌ ఇంజనీర్‌ జాబ్‌ ప్రొఫై ల్స్‌లో అత్యధిక సంఖ్యలో నియామకాలు జరిగాయి.
డేటా అనలిస్ట్‌లకు డిమాండ్‌
కన్సల్టింగ్, ఫైనాన్షియల్‌ రంగంలోని సంస్థలు డేటా అనలిస్ట్‌ల నియామకాలు ఎక్కువగా చేపట్టాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్‌ సంస్థలు.. క్లయింట్స్‌ను, విని యోగదారులను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అందుకే డేటా అనలిస్ట్‌లను ఎక్కువగా నియమించు కుంటున్నాయి. అదేవిధంగా కోడింగ్‌ స్కిల్స్‌కు కూడా డిమాండ్‌ అధికంగా కనిపించింది. ఐటీ మొదలు ఆన్‌లైన్‌ టెక్నాలజీస్‌ ఆధారంగా సేవలందిస్తున్న సంస్థల వరకూ.. అన్ని కంపెనీలు సాఫ్ట్‌వేర్స్, ప్రోగ్రామింగ్, డిజైనింగ్‌కు ప్రాధాన్యమిస్తుండటమే ఇందుకు కారణం.  
Follow our YouTube Channel (Click Here)
టాప్‌ రిక్రూటర్స్‌ వీరే
ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో.. క్వాల్‌ కామ్, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, గూగుల్, బార్‌క్లేస్, ఎస్‌ఏపీ ల్యాబ్స్, సిటీ బ్యాంక్, వెల్‌ ఫార్గో, మైక్రోసాఫ్ట్, బీసీజీ, బెయిన్‌ అండ్‌ కో సంస్థలు అంతర్జాతీయ ఆఫర్స్‌ అందించడంలో ముందంజలో ఉన్నాయి.  డొమెస్టిక్‌ ఆఫర్స్‌ విషయంలో ఉబెర్, హనీ వెల్, మైక్రాన్‌ టెక్నాలజీ, ఓఎన్‌జీసీ, ఫ్లిప్‌కార్ట్, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్, ఎస్‌టీఎం మైక్రో ఎలక్ట్రికల్స్‌ వంటి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి.
కోడింగ్‌ నైపుణ్యాలు తప్పనిసరి
ఐఐటీల క్యాంపస్‌ డ్రైవ్స్‌లో సంస్థలు విద్యార్థు ల్లోని కోడింగ్‌ నైపుణ్యాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. రిటెన్‌ టెస్ట్‌లు, టెక్నికల్‌ రౌండ్స్‌లో కోడింగ్‌ సంబంధిత స్కిల్స్‌ను ఎక్కువగా పరిశీలించాయని ప్లేస్‌మెంట్‌ వర్గాలు పేర్కొన్నాయి. కోర్‌ ఇంజనీరింగ్, సర్క్యూట్‌ బ్రాంచ్‌లకు సంబంధించి ఆయా విభాగా ల్లోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ నైపుణ్యాలను పరిశీలించాయని తెలిపారు.

Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలు.. హరియాణాలో బీజేపీ.. జమ్మూకశ్మీర్‌లో ఎన్‌సీ–కాంగ్రెస్‌ కూటమి గెలుపు

Job Mela: జాబ్‌మేళాకు విశేష స్పందన..

ఐఐఎం క్యాంపస్‌లలో
దేశంలో మేనేజ్‌మెంట్‌ విద్యకు కేరాఫ్‌గా నిలిచే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ క్యాంపస్‌లలో ఈ ఏడాది ఆఫర్స్‌ ఆశావాహంగానే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 21 ఐఐఎం క్యాంపస్‌లలో 2023–24లో పీజీ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు 90 శాతం మందికిపైగా ఆఫర్లు లభించాయి. ప్రముఖ ఐఐఎం క్యాంపస్‌లలో నూటికి నూరు శాతం విద్యార్థులకు ఆఫర్లు సొంతమయ్యాయి. 
➡︎    ఐఐఎం– బెంగళూరు క్యాంపస్‌లో పీజీపీ విద్యార్థులకు సగటున రూ.32.5 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్లు లభించాయి.
➡︎    ఐఐఎం అహ్మదాబాద్‌లో 100 శాతం ప్లేస్‌మెంట్స్‌ నమోదయ్యాయి. ఈ క్యాంపస్‌లో సగటు వార్షిక వేతనం రూ.35 లక్షలుగా ఉండడం గమనార్హం.
➡︎    ఐఐఎం–కోల్‌కతలో కూడా 100 శాతం ప్లేస్‌మెంట్స్‌ లభించాయి. 
➡︎    ఐఐఎం–లక్నోలో సగటు వేతనం రూ.30 లక్షలుగా నమోదైంది. 
➡︎    ఐఐఎం–ఇండోర్, బో«ద్‌గయ తదితర న్యూ జనరేషన్‌ ఐఐఎంలలో సగటు వేతనాల్లో తగ్గుదల కనిపించింది. అయితే వీటిలో 100 శాతం ప్లేస్‌మెంట్స్‌ లభించడం విశేషం.
Follow our Instagram Page (Click Here)
ఈ మూడు రంగాలు
ఐఐఎంలలో 2024 ఫైనల్‌ ప్లేస్‌మెంట్స్‌లో కన్సల్టింగ్, ఫైనాన్స్, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ విభా గాల హవా కనిపించింది. అంతర్జాతీయంగా పేరు న్న బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, పీడబ్ల్యూసీ, డెలా యిట్, కేపీఎంజీ, ఈ అండ్‌ వై తదితర సంస్థలు ఆఫర్ల విషయంలో ముందంజలో నిలిచాయి. వీటి తో పాటు బీఎఫ్‌ఎస్‌ఐ, ఈ–కామర్స్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, ఐటీ/ఐటీఈఎస్‌ సంస్థలు కూడా భారీ నియామకాలు చేపట్టాయి.   
కన్సల్టింగ్‌ హవా
మొత్తం ఆఫర్లలో దాదాపు 40 శాతం కన్సల్టింగ్‌ సంస్థల నుంచే ఉండటం విశేషం. కార్పొరేట్‌ కంపెనీలు వ్యాపార ప్రణాళికల విస్తరణలో భాగంగా కన్సల్టింగ్‌ సంస్థలను సంప్రదిస్తున్నాయి. ఇదే ఇప్పుడు కన్సల్టింగ్‌ కంపెనీల్లో నియామకాలు భారీగా పెరగడానికి కారణమని చెబుతున్నారు. 
Temporary Jobs at IIITDM : ట్రిపుల్‌ ఐటీడీఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు
u    ఈ–కామర్స్, స్టార్టప్స్‌ ఆఫర్లు భారీగా లభించాయి. ఎప్పటి మాదిరిగానే కన్సల్టింగ్, బీఎఫ్‌ ఎస్‌ఐ సంస్థలు ఆఫర్లలో ముందు వరుసలో నిలిచాయి. అదే విధంగా మాన్యు ఫ్యాక్చరింగ్‌ విభాగంలోనూ నియామకాలు ఆశాజనకంగానే కనిపించాయి. వీటిలోనూ అధిక శాతం డేటా అనాలిసిస్, బిగ్‌ డేటా, మార్కెటింగ్, ఫైనాన్స్‌ భాగాల్లోనే లభించాయి.
కంపెనీలు కోరుకుంటున్న లక్షణాలు
ఐఐఎం విద్యార్థులకు ఆఫర్లు ఖరారు చేసిన కార్పొరేట్‌ సంస్థలు.. ప్రాబ్లమ్‌  సాల్వింగ్‌ స్కిల్స్, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. కోర్‌ స్కిల్స్‌ కోణంలో సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు సదరు సబ్జెక్ట్‌కు సంబంధించి డిజిటల్‌ నైపుణ్యాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టాయి. అదే విధంగా బిజినెస్‌ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్‌  వంటి లేటెస్ట్‌ స్కిల్స్‌ ఉన్న విద్యార్థులకు పెద్ద పీట వేశాయని ఆయా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

Join our WhatsApp Channel (Click Here)

#Tags