Holiday due to Heavy Rains : భారీ వర్షాల కారణంగా రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశం.. ముందస్తు చర్యలపై మంత్రి క్లారిటీ..!
సాక్షి ఎడ్యుకేషన్: గత కొద్ది రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సోమవారం సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే, పలు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెలవు ప్రకటించగా మిగితా జిల్లాలపై నిర్ణయం ఆయా జిల్లా కలెక్టర్లదే అని తెలిపారు. అయితే, సెలవు రేపు.. అంటే, బుధవారం కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు, వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు చేసే ప్రయత్నాలను వివరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలు కలెక్టర్లు, మంత్రులు, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం, మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ఇంత కఠిన సమయంలో రాష్ట్ర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుందుకు తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదులు ప్రారంభమైయ్యాయి. దీంతో చాలా ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేక, కరెంట్ సమస్యలు ఉండడంతో తీర్వ ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టే నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగుకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఇలా ముందస్తు చర్యలు చేపట్టినందుకే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వివరించారు పొంగులేటి.
Degree Admissions: ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు
45 పునరావాస కేంద్రాలు..
ఇప్పటివరకు రాష్ట్రంలో పూర్తిగా 45 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ వరదల కారణంగా పాత ఇళ్లు, గోడలు ఎటువంటి సమయంలోనైనా కూలే అవకాశం ఉందని అందుకే అక్కడి వాసులతోపాటు మరో 3వేల పైగా ప్రజలను ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు.
ఆ ప్రాంతంలోని కుటుంబాన్ని మాత్రం..
తన నియోజకవర్గం పాలేరులో వరదల్లో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని కాపాడేందుకు ప్రతీ ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే అక్కడికి ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌ను తరలించే సమయంలో వాతావరణం సహకరించలేదు. దీంతో ఈ మార్గాన్ని చేపట్టలేకపోయామన్నారు. ఆ కుటుంబంలోంచి ముగ్గులు ఇంటి పైనకి ఎక్కారు. ఇదే సమయంలో వరద ముంచెత్తడంతో ఆ ముగ్గురు కొట్టుకుపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో ఒకరిని చేరుకున్న బృందం మరో ఇద్దరిని గాలిస్తున్నారు. వారిని కాపాడేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని భావోధ్యేగానికి గురైయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.