MITS Engineering College : మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు అవార్డులు
కురబలకోట: అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ ఈఈఈ విద్యార్థి కాగితి భార్గవికి బెస్ట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విద్యార్థి అవార్డు, సీఎస్‌సీ విద్యార్థి కార్తీక్ కోవి బెస్ట్ స్టూడెంట్ ఇన్నోవేటర్ రాష్ట్ర అవార్డులకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ యువరాజ్ సోమవారం తెలిపారు.
ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డులకు ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వీరిని ఎంపిక చేశారని తెలిపారు. ఇదివరకే ఈ కళాశాల ప్రిన్సిపాల్ యువరాజ్‌ను బెస్ట్ ప్రిన్సిపాల్‌గా ఎంపిక చేశారు. ఇప్పుడు ఇద్దరు విద్యార్థులతో కలిపి మొత్తం ముగ్గురు ఈ కళాశాల నుండి రాష్ట్ర అవార్డులకు ఎంపికయ్యారు. ఈనెల 25న కర్నూలులోని జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో అవార్డులను అందుకుంటారని వారు తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)