AP 10th Class & Inter Exams Time Table 2024: పదోతరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌

తేదీ ఫస్టియర్‌ తేదీ సెకండియర్‌
మార్చి 1 లాంగ్వేజ్‌ పేపరు1 మార్చి 2 లాంగ్వేజ్‌ పేపరు2
మార్చి 4 ఇంగ్లిష్‌ మార్చి 5 ఇంగ్లీష్‌
మార్చి 6 గణితం1ఎ, బోటనీ,సివిక్స్‌ మార్చి 7 గణితం2బి,బోటనీ, సివిక్స్‌
మార్చి 9 గణితం1బి, జువాలజీ, హిస్టరీ మార్చి 11 గణితం2బి, జువాలజీ, హిస్టరీ
మార్చి 12 ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ మార్చి 13 ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌
మార్చి 14 కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ మార్చి 15 కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌
మార్చి 16 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లాజిక్‌, బ్రిడ్జికోర్సు గణితం మార్చి 18 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లాజిక్‌ పేపరు, బ్రిడ్జికోర్సుగణితం,
మార్చి 19 మోడ్రన్‌ లాంగ్వేజ్‌ జాగ్రఫీ మార్చి 20 మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జాగ్రఫీ

రాయవరం: ఇప్పుడు జిల్లా అంతా పరీక్షల ఫీవర్‌ ప్రారంభమవుతోంది. ఏప్రిల్‌ నెలలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మార్చి నెలాఖరులోపు పది, ఇంటర్‌ పరీక్షలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. దీంతో జిల్లాలో చదువుతున్న పది, ఇంటర్‌ విద్యార్థుల్లో పరీక్షల ఫీవర్‌ ప్రారంభమైంది. ఇప్పటికే సెకండరీ, మాధ్యమిక విద్యాశాఖలు విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్‌ చేసే దిశగా సన్నద్ధం చేస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది జూలై నుంచే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది.

చ‌ద‌వండి: AP Inter Study Material

మార్చి 1 నుంచి ఫస్టియర్‌, 2 నుంచి సెకండియర్‌
ఇంటర్మీయెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను మాధ్యమిక విద్యాశాఖ విడుదల చేసింది. ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 1 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, మార్చి 2వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఫస్టియర్‌ పరీక్షలు మార్చి 19, సెకండియర్‌ పరీక్షలు 20తో ముగియనున్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 2న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వేల్యూస్‌, 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహిస్తారు. సమగ్ర శిక్షా ఒకేషనల్‌ ట్రేడ్‌ ఎగ్జామినేషన్‌ను ఫిబ్రవరి 22న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తుండగా, ఇంటర్‌ సెకండియర్‌ జనరల్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించనుండగా, ఒకేషనల్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్స్‌లో నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌ ప్రాక్టికల్స్‌ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ ప్రాక్టికల్స్‌ 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు.

24,924 మంది రెగ్యులర్‌, 2,702 మంది ప్రైవేట్‌ విద్యార్థులు
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 13 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్‌, ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ కళాశాలలు ఆరు, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలు 64, ఒకేషనల్‌ అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలు 44 ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న 13,764 మంది ఫస్టియర్‌, 11,160 మంది సెకండియర్‌ విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రైవేట్‌గా 2,702 మంది ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

మార్చి 18 నుంచి పదో తరగతికి..
జిల్లాలో 2024 మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 18న ఫస్ట్‌ లాంగ్వేజ్‌తో ప్రారంభమై 30న ఓఎస్‌ఎస్‌సీ లాంగ్వేజ్‌ పేపరు–2తో పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. గత విద్యా సంవత్సరం పది పరీక్షలను రోజు విడిచి రోజు నిర్వహించగా, ఈసారి వరుసగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌ పేపర్లను మాత్రం వేర్వేరుగా నిర్వహించడం గమనార్హం.

జిల్లాలో పరిస్థితి ఇదీ
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 22 మండలాల పరిధిలో 372 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల నుంచి పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 18,994 మంది పదవ తరగతి పరీక్షల దరఖాస్తులను సమర్పించగా, 18,797 మంది పరీక్ష ఫీజును చెల్లించారు. ఇంకా 197 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంది. రెగ్యులర్‌ విద్యార్థుల్లో 9,607 మంది బాలురు, 9,387 మంది బాలికలు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇంగ్లిష్‌ మీడియంలో 7,020 మంది బాలురు, 6,876 మంది బాలికలు, తెలుగు మీడియంలో 2,587 మంది బాలురు, 2,511 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ప్రైవేట్‌గా 1,284 మంది బాలురు, 804 మంది బాలికలు పది పరీక్షలు రాసేందుకు ఫీజును చెల్లించారు.
పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల మార్చి 1 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, 2 నుంచి సెకండియర్‌ పరీక్షలు మార్చి 18 నుంచి పది పరీక్షలు ప్రారంభం జిల్లాలో 18,997 మంది పది, 27,626 మంది ఇంటర్‌ విద్యార్థులు

చ‌ద‌వండి: AP 10th Class TM Study Material

పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌

తేదీ పరీక్ష పేపరు
మార్చి 18 ఫస్ట్‌ లాంగ్వేజ్‌
మార్చి 19 సెకండ్‌ లాంగ్వేజ్‌
మార్చి 20 ఇంగ్లిష్‌
మార్చి 22 గణితం
మార్చి 23 జనరల్‌ సైన్స్‌ పీఎస్‌
మార్చి 26 జనరల్‌ సైన్స్‌ బీఎస్‌
మార్చి 27 సోషల్‌ స్టడీస్‌
మార్చి 28 ఫస్ట్‌లాంగ్వేజ్‌ పేపరు–2 (కాంపోజిట్‌ కోర్స్‌/
ఓఎస్‌ఎస్‌సీ ఇన్‌ లాంగ్వేజ్‌ పేపరు1(సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)
మార్చి 30 ఓఎస్‌ఎస్‌సీ ఇన్‌ లాంగ్వేజ్‌ పేపరు2(సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)/
ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ)

#Tags