AFTA : రేపు ఆప్టా 2వ రాష్ట్ర కౌన్సెల్ సమావేశం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) 2వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఈ నెల 20న అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి వెంకటరత్నం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి ఆప్టా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ప్రతినిధులు హాజరుకానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సంఘం బాధ్యులు సమావేశానికి హాజరై, విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags