Open Degree Exams: నేటి నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు

మంచిర్యాల జిల్లా: డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఐదో సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

డిగ్రీ కళాశాల అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అధ్యయన కేంద్రంలో చదువుతున్న ఐదో సెమిస్టర్‌ విద్యార్థులు విధిగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

తరగతుల వేళలు మార్పు..
అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సెమిస్టర్‌ పరీక్షల నేపథ్యంలో రెగ్యులర్‌ తరగతుల వేళలు మార్చినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు, బోధన సిబ్బంది మారిన సమయపాలనను అనుసరించాలని సూచించారు.

#Tags