Social Welfare Hostels: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశానికి దరఖాస్తులకు ప్రోత్సాహించాలి..
ఒంగోలు: ఒంగోలు డివిజన్ పరిధిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 2024–25 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు నూరు శాతం జరిగేలా విద్యార్థుల తల్లిదండ్రులకు తగిన సమాచారం ఇచ్చి ప్రోత్సహించాలని సహాయ సాంఘిక సంక్షేమాధికారి (ఏఎస్‌డబ్ల్యూఓ) టి.లింగయ్య సూచించారు. ప్రగతిభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఏఎస్‌డబ్ల్యూఓ కార్యాలయంలో గురువారం వసతి గృహాల సంక్షేమాధికారులు (హెచ్‌డబ్ల్యూఓలు)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌డబ్ల్యూఓ లింగయ్య మాట్లాడుతూ ఆయా పంచాయతీలలో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా విద్యార్థుల వివరాలు తెలుసుకుని అర్హత ఉన్న విద్యార్థులకు సమాచారం ఇచ్చి దరఖాస్తు చేసుకునేలా చూడాలని చెప్పారు.
Girls Gurukul Admissions: బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు..
డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో 13 వసతి గృహాలు ఉన్నాయని, అందులో ప్రీ మెట్రిక్ వసతి గృహాలలో బాలురకు ఐదు, బాలికలకు మూడు వసతి గృహాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో మూడు నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశానికి అవకాశం ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలని కోరారు. అదే విధంగా జూనియర్ కళాశాలకు చెందిన పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల్లో రెండు బాలురకు, మూడు బాలికలకు ఉన్నాయని తెలిపారు. వాటిలో ఉన్న సౌకర్యాల గురించి వివరించారు. జూన్ 1 నుంచి పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల్లో వసతి కల్పిస్తున్నట్లు చెప్పాలన్నారు. అడ్మిషన్లు పొందగోరు విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఒంగోలు, మద్దిపాడు, బి.నిడమానూరు, అమ్మనబ్రోలు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఇవ్వాలన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు.
Telangana Medical Jobs 2024 : 5348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. త్వరలోనే..!
అదే విధంగా ఆయా సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న చిన్నపాటి మరమ్మతులు పూర్తి చేయించి చక్కగా ఉండేలా చూడాలని సూచించారు. గత విద్యాసంవత్సరంలో ఆయా వసతి గృహాల్లో 133 మంది విద్యార్థులకుగానూ 113 మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంపై ఆయా వసతి గృహాల సంక్షేమ అధికారులను అభినందించారు. సమావేశంలో ఆయా వసతి గృహాల సంక్షేమ అధికారులు అంకబాబు, పార్వతి, రాఘవ, ప్రభుదాస్, అరుణ, శ్రీలత, స్వప్నలత, శిరీష, మునికుమార్, దుర్గా తదితరులు పాల్గొన్నారు.
Visakhapatnam Port: అరుదైన ఘనత సాధించిన విశాఖ పోర్టు.. అది ఏమిటంటే..