Teacher Posts: 2,222 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
కొరుక్కుపేట: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ టీచర్లు, జిల్లా రిసోర్స్ సెంటర్ టీచర్ ట్రైనీల పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్ లభించింది. నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ఈ మేరకు బుధవారం టీచర్ సెలక్షన్ బోర్టు నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఇందులో గ్రాడ్యుయేట్ టీచర్స్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ టీచర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు అని , దరఖాస్తు చేసేటప్పుడు ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అర్హత రుసుము పత్రాలను తప్పనిసరిగా పంపించాలని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ టీచర్లు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ టీచర్ ట్రైనర్లు కోసం ప్రస్తుతం 2222 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దీనికి సంబందించిన పోటీ పరీక్ష 2024 జనవరి 7వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు . ఖాళీలలో పాఠశాల విద్యలో 2,171, అత్యంత వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖలో 23, ఆది ద్రావిడ సంక్షేమ శాఖలో 16, వికలాంగుల సంక్షేమ శాఖలో 12 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టుల వివరాలను శాఖల వారీగా, సబ్జెక్టుల వారీగా, రిజర్వేషన్లు వారీగా ఉపాధ్యాయుల ఎంపిక బోర్టు వెబ్‌సైట్‌లో ప్రచురించినట్లు వెల్లడించారు.
Tags
- teacher posts
- 2
- 222 graduate teacher posts
- Graduate Jobs
- Govt Jobs
- AP State News
- ts news 2023
- 9760 Senior Teacher Posts
- Jobs
- trending jobs
- Latest Jobs News
- APPSC
- APPSC Jobs
- news today
- Google News
- Get Latest Photo Stories in Telugu and English
- Competitive Exams
- Government Entrance Exams
- sakshi education
- Current Affairs
- Daily Current Affairs
- Job Fair
- TeacherTrainees
- GovernmentSchools
- Exams
- latest jobs in 2023
- sakshi education job notifications