Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
Sakshi Education

పళ్లిపట్టు: మహిళలకు స్వయం ఉపాధి ఉచిత శిక్షణ బుధవారం ప్రారంభమైంది. మహిళలు ఉపాధి అవకాశాలు పొంది ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు స్వయం ఉపాధి శిక్షణ కల్పిస్తున్నారు. ఇందులోభాగంగా ఆర్కేపేట యూనియన్ సెల్లాత్తూరులో ఆల్ ది చిల్డ్రన్ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఎంబ్రాయిడింగ్ టైలరింగ్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
పంచాయతీ సర్పంచ్ దురై ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించగా గ్రామానికి చెందిన 50 మంది శిక్షణ పొందుతున్నారు. వారం రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతుల్లో ఎంబ్రాయిడింగ్ టైలరింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నందున మహిళలు శిక్షణ పూర్తిచేసుకుని ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగగలరని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.
Published date : 13 Oct 2023 01:39PM