ఉపాధి కల్పించేందుకే కుట్టు మిషన్ శిక్షణ
Sakshi Education
తొర్రూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతులకు ఉపాధి కల్పించేందుకే కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని అమ్మాపురంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన మంత్రి దయాకర్‌రావు శిక్షణ పొందుతున్న మహిళలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ కడెం యాకయ్య, ఎంపీటీసీ డొనక ఉప్పలయ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు ముద్దం వీరారెడ్డి, శిక్షణ నిర్వాహకులు రాధిక, సర స్వతి, మహిళలు పాల్గొన్నారు.
Published date : 11 Aug 2023 10:03AM