Skip to main content

APPSC exams arrangements: ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

APPSC examination   Educational institutions   APPSC exams arrangements news    Joint Collector M. Jahnavi giving instructions for APPSC examination preparations.
APPSC exams arrangements news

ఈనెల 25న నిర్వహించే ఏపీపీఎస్సీ పరీక్ష సజావుగా జరిగేందుకు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారమివ్వకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, మాకవరపాలెంలలో 33 విద్యా సంస్థల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు పరీక్ష జరుగుతుందన్నారు.

పరీక్ష కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు కల్పించాలన్నారు. పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 10,627 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు.

రూట్‌ ఆఫీసర్స్‌ అయిన జిల్లా అధికారులు లైజన్‌ అధికారులైన తహసీల్దార్లు, ఎంపీడీవోలు వారికి కేటాయించిన పనుల్లో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ డి.రామ్మూర్తి, ఎస్‌.ఎ.రహ్మాన్‌ పాల్గొన్నారు.

Published date : 20 Feb 2024 05:44PM

Photo Stories