School Holidays : నాలుగు రోజులు పాటు స్కూల్స్‌కు సెలవులు.. ఎందుకంటే..?
ఎందుకంటే ఆగస్టు 12వ (శుక్రవారం) తేదీన రాఖీ పండుగ, అలాగే ఆగస్టు 13వ తేదీన రెండో శనివారం కారణంగా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 14వ తేదీన సాధారణ సెలవు ఆదివారం ఉంది. సోమవారం ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంది. దీంతో స్కూల్స్‌కు వరుసగా నాలుగు పాటు సెలువులు రానున్నాయి.
ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను పరిశీలిస్తే..
➤ ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు
➤ ఏప్రిల్ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు
➤ వేసవి సెలవులు: ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు
➤ ప్రైమరీ స్కూల్స్: ఉదయం 9am నుంచి 4pm వరకు తరగతులు
➤ ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9am నుంచి 4.15pm వరకు తరగతులు
➤ ఉన్నత పాఠశాలల తరగతులు: ఉదయం 9.30am నుంచి 4.45pm వరకు తరగతులు
➤ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు (14రోజులు).. అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి 16 రోజులు సెలవులు రానున్నాయి.
➤ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
➤ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు)