Skip to main content

Telangana Tenth and Inter Public Exam Dates 2024 : తెలంగాణ‌లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..! ఈ సారి మాత్రం ఇలాగే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. తాజాగా తెలంగాణ‌లో కూడా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. అలాగే తెలంగాణ‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Exam Schedules for Andhra Pradesh and Telangana  Telangana Intermediate Public Exams Scheduled from February 28  TS Tenth and Inter Exams Time Table 2024   Andhra Pradesh Tenth and Inter Public Exam Schedule Released

ఇటీవల ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

లేదంటే మార్చి 1 నుంచి..

త్వరలోనే ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ అధికారిక షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలోనే లోక్‌స‌భ‌ ఎన్నికలు ఉన్న‌ నేపథ్యంలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వ‌హ‌ణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి ఏడాది ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఇంటర్ బోర్డు అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సర్కారుకు పంపించారు. పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభించాలని, లేదంటే మార్చి 1 నుంచి మొదలు పెట్టాలని ప్రపోజల్స్ పెట్టారు. ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ పరీక్ష‌లు 2024 తేదీల‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్ల‌డించారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పదో తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

 Class 10 Exam Dates revealed by Education Minister in Andhra Pradesh  AP 10th Class Public Exams Time Table 2024 Andhra Pradesh Education Minister Botsa Satyanarayana announces Class 10 Exam Dates for 2024

మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌ను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జ‌ర‌గ‌నున్నాయి.  అలాగే ఈ సారి ఏడు సబ్జెక్ట్‌లకే పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సారి టెన్త్‌లో 6 లక్షలు విద్యార్థులు ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకానున్నారు.

ఏపీ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..

10th exam dates 2023

పరీక్ష తేదీ సబ్జెక్టు
మార్చి 18 లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20 ఇంగ్లీష్
మార్చి 22  మాథ్స్
మార్చి 23 ఫిజికల్ సైన్స్
మార్చి 26 బయాలజీ
మార్చి 27 సోషల్ స్టడీస్
మార్చి 28 మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
మార్చి 30 ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష

ఏపీ ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల టైమ్ టేబుల్ ఇదే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌బ్లిక్ పరీక్ష‌లు 2024 తేదీల‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్ల‌డించారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంట‌ర్‌ పరీక్షలను మార్చిలోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

AP Inter Public Exams Dates 2024

ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు జరుగనున్నాయి. ఈ సారి ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం మొత్తం క‌లిపి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజ‌రుకానున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

                                              sakshi education whatsapp channel image link


ఏపీ ఇంట‌ర్‌ 1st & 2nd Year 2024 Timetable ఇదే..

పరీక్ష తేదీ ఫస్ట్ ఇయర్  పరీక్ష తేదీ సెకండ్ ఇయర్
March 1

 

PART-II

2nd Language Paper-I

March 2

 

PART-II

2nd Language Paper-II

March 4

 

PART-I

English Paper-I

March 5

 

PART-I

English Paper-II

March 6

 

Mathematics Paper-1A

Botany Paper - 1

Civics Paper - 1

March 7

 

Mathematics Paper - IIA

Botany Paper-II

Civics Paper - II

March 9 

 

Mathematics Paper-1B

Zoology Paper - 1

History Paper - 1

March 11

 

Mathematics Paper - IIB

Zoology Paper-II

History Paper - II

March 12

 

Physics Paper - 1

Economics Paper - 1

March 13

 

Physics Paper - II

Economics Paper - II

March 14

 

Chemistry Paper- I

Commerce Paper - 1

Sociology Paper - 1

Fine Arts Music Paper-1

March 15

 

Chemistry Paper- II

Commerce Paper - II

Sociology Paper - II

Fine Arts Music Paper-II

March 16

 

Public Administration Paper- I

Logic Paper - 1

Bridge Course Mathematics Paper - 1

March 18

 

Public Administration Paper- II

Logic Paper - II

Bridge Course Mathematics Paper - II

March 19

 

Modern Language Paper- I

Geography Paper - 1

March 20

 

Modern Language Paper- II

Geography Paper - II

Published date : 19 Dec 2023 01:33PM

Photo Stories